Richest Beggar: బిచ్చమెత్తుకుంటూ రూ. 7.5 కోట్లు సంపాదించాడు ఓ వ్యక్తి. ప్రపంచంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన బిచ్చగాళ్ల జాబితాలో చేరారు. నెలకు రూ. 60 వేల నుంచి రూ.75 వేల వరకు సంపదిస్తూ ఈ ఖ్యాతి గడించాడు. అతను ఎవరో కాదు మన దేశానికి చెందిన భరత్ జైన్. అతని ఆస్తులు చూసి సాధారణ ప్రజలు అవాక్కవుతున్నారు. మహారాష్ట్ర ముంబై నగరానికి చెందిన భరత్ జైన్ కి ఇన్ని ఆస్తులు ఉన్నా కూడా ఇప్పటికీ యాచక వృత్తిని కొనసాగిస్తూనే ఉన్నాడు.
Read Also: El Nino: పసిఫిక్‌లో “ఎల్ నినో”.. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటన.. వర్షాలపై ప్రభావం
భరత్ జైన్ కు భార్య, ఇద్దరు పిల్లలు, తండ్రి, ఓ సోదరుడు ఉన్నారు. జైన్‌కు ముంబయిలో రూ.1.2 కోట్ల విలువైన ఓ డబుల్ బెడ్రూం ఫ్లాట్ ఉంది. ఠారేలో తనకు ఉన్న రెండు షాపుల ద్వారా ఏకంగా నెలకు రూ. 30 వేలు అద్దెను తీసుకుంటున్నాడు. దీంతో పాటు బిచ్చమెత్తుకుంటూ రూ.2000-2500 సంసాదిస్తున్నాడు.
భరత్ జైన్ కుటుంబం ముంబయిలోని పరేల్ ప్రాంతంలో ఓ డూప్లెక్స్ ఇంటిలో ఇతను నివాసం ఉంటున్నాడు. అతని పిల్లలు స్థానిక కాన్వెంట్ లో చదువుకుంటున్నారు. మిగతా కుటుంబ సభ్యులు స్టేషనరీ షాప్ నడిపిస్తున్నారు. బిచ్చమొత్తుకోవడం మానేయాలని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా భరత్ జైన్ వినలేదని, తనను ఇంతవాడిని చేసిన ఈ వృత్తిని వదిలేసేందుకు నిరాకరిస్తున్నాడు.