Site icon NTV Telugu

Tahawwur Rana: భారత్‌కి తహవూర్ రాణా అప్పగింతపై పాకిస్తాన్ ఏం చెబుతోంది..?

Tahawwur Rana

Tahawwur Rana

Tahawwur Rana: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో 166 మంది మరణానికి కారణమైన పాక్-కెనెడియన్ ఉగ్రవాది తహవూర్ రాణాని భారత్‌కి తీసుకువచ్చారు. అమెరికా అతడిని ఇండియాకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. గురువారం భారతీయ అధికారులు, రాణాని ఢిల్లీకి చేర్చారు. ఇతడిని ప్రశ్నించేందుకు ఎన్ఐఏ, ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాయి.

ఇదిలా ఉంటే, ఈ వ్యవహారానికి పాకిస్తాన్ దూరంగా ఉంది. కెనడాకు వెళ్లిన తర్వాత తన పౌరసత్వాన్ని(పాక్ పౌరసత్వం) పునరుద్ధరించుకోవడానికి రాణా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని, అంటే కెనడాకు వలస వెళ్లిన వారికి పాకిస్తాన్ ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదని, రాణా కెనెడియన్ జాతీయుడిని స్పష్టంగా ఉందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ చెప్పినట్లు పాకిస్తాన్ నివేదించింది. తహవూర్ రాణా గత రెండు దశాబ్దాలుగా పాక్ పత్రాలను పునరుద్ధరించలేదని వెల్లడించారు.

Read Also: Tahawwur Rana: తహవూర్ రాణా టార్గెట్‌లో కుంభమేళా, పుష్కర్ మేళా..

అయితే, ఉగ్రవాది రానాకి పాకిస్తాన్ సైన్యం, ఆ దేశ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌(ఐఎస్ఐ) తో పాటు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయి. ఈ మూడింటి సమన్వయంతోనే 26/11 ముంబై ఉగ్రదాడులు జరిగాయనేది ఓపెన్ సీక్రెట్. రాణా మరో ఉగ్రవాది పాకిస్తానీ అమెరికన్ డేవీడ్ కోల్మన్ హెడ్లీకి సహాయం చేయడంలో కీలక పాత్ర పోషించాడని నిఘా సంస్థలు భావిస్తున్నాయి.

అంతకుముందు, కోపెన్‌హాగన్‌లోని ఒక వార్తాపత్రికపై దాడి చేయడానికి ప్లాన్ చేయడం, ముంబై దాడులకు కారణమైనందుకు, పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాల ఉన్న కారణంగా అక్టోబర్ 2009లో అమెరికా ఎఫ్‌బీఐ రాణాని అరెస్ట్ చేసింది. రెండు ఏళ్ల తర్వాత దోషిగా నిర్ధారించబడ్డాడు.

Exit mobile version