Site icon NTV Telugu

PM Surya Ghar Yojana: ప్రధాని ఉచిత విద్యుత్ పథకం.. సోలార్ రూఫ్‌టాప్ కోసం ఇలా అప్లై చేసుకోండి..

Rooftop Solar Systems

Rooftop Solar Systems

PM Surya Ghar Yojana:  ‘‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ’’పేరుతో ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రకటించారు. కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం కోసం రూఫ్‌టాఫ్ సోలార్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. రూ. 75,000 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. సబ్సీడీలు, భారీ రాయితీలను నేరుగా ప్రజల ఖాతాలకు చేరేలా కేంద్రం భరోసా ఇస్తోంది.

ఈ పథకాన్ని అట్టడుగు స్థాయికి చేరేలా ప్రాచుర్యంలోకి తీసురావడానికి పట్టణ, స్థానిక సంస్థలు, పంచాతీలు తమ అధికార పరిధిలో సోలార్ సిస్టమ్స్‌ని ప్రోత్సహించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ పథకం ద్వారా తక్కువ విద్యుత్ బిల్లులతో పాటు ప్రజలకు ఉపాధి కల్పనకు దారి తీస్తుందని చెప్పారు.

Read Also: Bramayugam: ఫ్యాన్స్ కు చేదువార్త.. మెగాస్టార్ సినిమా తెలుగులో వాయిదా

ఉచిత విద్యుత్ పథకానికి ఇలా దరఖాస్తు చేసుకోవాలి:

* అధికారిక వెబ్‌సైట్‌ను  https://pmsuryaghar.gov.in/
హోమ్‌పేజీలో అప్లై ఫర్ రూఫ్‌టాప్ సోలార్‌పై క్లిక్ చేయండి.

* మీ రాష్ట్రం, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, మీ కన్జ్యూమర్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్‌ని పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.

* ఫామ్‌లో చెప్పని విధంగా సోలార్ రూఫ్‌టాప్ కోసం అప్లై చేసుకోవాలి.

* డిస్కం నుంచి సాధ్యాసాధ్యాల ఆమోదం కోసం వేచి చూడాలి. ఆమోదం పొందిన తర్వాత మీ డిస్కంలో రిజిస్టర్ విక్రేత నుంచి సోలార్ ప్లాంట్ ఇన్‌స్టాల్ చేయబడుతుంది.

* ఇన్‌స్టాలేషన్ పూర్తైన తర్వాత ప్లాంట్ వివరాలు సమర్పించి, నెట్ మీటరింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

* నెట్ మీటర్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, డిస్కమ్ తనిఖీ చేసిన తర్వాత వారు పోర్టల్ నుంచి కమీషనింగ్ సర్టిఫికేట్‌ని రూపొందిస్తారు.

* ఒకసారి కమీషనింగ్ రిపోర్ట్ పొందిన తర్వాత, బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్యాన్సల్డ్ చెక్‌ని సమర్పించాలి.

* 30 రోజుల్లోగా మీ బ్యాంక్ ఖాతాతో మీ సబ్సిడీ డబ్బుల్ని అందుకుంటారు.

Exit mobile version