NTV Telugu Site icon

స్టూడెంట్‌ క్రెడిట్‌ కార్డు స్కీమ్‌.. రూ.10 లక్షల వరకు రుణం

Student Credit Card

Student Credit Card

ప‌శ్చిమ బెంగాల్ ప్రభుత్వం విద్యార్థుల కోసం స్టూడెంట్ క్రెడిట్ కార్డు స్కీమ్‌ను ప్రవేశ‌పెట్టింది. ఈ ప‌థ‌కాన్ని ప్రక‌టించినందుకు ఆనంద‌ప‌డుతున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. బెంగాలీ యువ‌త‌ను స్వయం స‌మృద్ధి చేయాల‌న్న దీక్షతో విద్యార్థుల‌కు రుణాలు ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. క్రెడిట్ కార్డు స్కీమ్ కింద విద్యార్థుల‌కు సుమారు ప‌ది ల‌క్షల వ‌ర‌కు రుణం ఇవ్వనున్నారు. అయితే ఆ రుణంపై వార్షికంగా అతి స్వల్ప స్థాయిలో వ‌డ్డీ వ‌సూల్ చేయ‌నున్నట్లు సీఎం మ‌మ‌తా తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చినహామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కాగా, ఈ రుణాలను 15 ఏళ్లలో తిరిగి చెల్లించే కాల పరిమితితో చాలా నామమాత్రపు వార్షిక సాధారణ వడ్డీ రేటుతో రూ.10లక్షలు రుణం ఇస్తున్నట్టు చెప్పారు. ఈ క్రెడిట్‌ కార్డు ద్వారా 4 శాతం వడ్డీతో రూ.10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు.