దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈరెండు రాష్ట్రాల తరువాత అత్యధికంగా కేసులు పశ్చిమబెంగాల్‌లో నమోదవుతున్నాయి. బెంగాల్‌లో కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో 14,022 కేసులు నమోదైనట్టు స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. రాష్ట్రంలో 33,042 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయని అన్నారు. 2075 మంది ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారని, రాష్ట్రంలో మొత్తం 403 కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
Read: వనమా రాఘవ అరెస్ట్…
రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ప్రస్తుతం 23.17శాతంగా ఉందని, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్టు మమతా బెనర్జీ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,517 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పశ్చిమ బెంగాల్‌కు రావాలంటే తప్పని సరిగా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి తెలియజేశారు. అదేవిధంగా మరిన్ని నిబంధనలు అవసరమని, రేపు ప్రధానితో దీనిపై చర్చిస్తామని అన్నారు. రేపు ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్‌కు రాబోతున్నారు. కోల్‌కతాలో చిత్తరంజన్ జాతీయ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లోని రెండో క్యాంపస్‌ను ప్రారంభించబోతున్నారు.
