వ‌న‌మా రాఘ‌వ అరెస్ట్‌…

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని పాల్వంచ ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు కుమారుడు వ‌న‌మా రాఘ‌వ‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  జ‌న‌వ‌రి 3 వ తేదీన పాల్వంచ‌లో రామ‌కృష్ట అనే వ్య‌క్తి త‌న కుటుంబంతో స‌హా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.  ఆత్మ‌హ‌త్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకొని త‌న ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం వ‌న‌మా రాఘ‌వ అని, ఆయ‌న చేసిన అక్ర‌మాల గురించి సెల్పీ వీడియోలో పేర్కొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.  ఈ ఘ‌ట‌న రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది.  

Read: చైనా స‌న్‌: సూర్యుడి కంటే ఐదు రెట్లు వేడి…

వ‌న‌మా రాఘ‌వ‌ను అరెస్ట్ చేయాల‌ని రాజ‌కీయ పార్టీలు వ‌న‌మా ఇంటిని చుట్టుముట్టిన సంగ‌తి తెలిసిందే.  ప‌లువులు నేత‌లు ఈ ఘ‌ట‌న‌పై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.  వ‌న‌మా రాఘ‌వ‌ను అరెస్ట్ చేయాల‌ని, ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావుపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నేత‌లు డిమాండ్ చేశారు.  కాగా, రాఘ‌వ‌ను ఎమ్మెల్యే వ‌న‌మా పోలీసుల‌కు అప్ప‌గించారు.  కొత్త‌గూడెం నుంచి వ‌చ్చిన పోలీసులు వ‌న‌మా రాఘ‌వ‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈరోజు ఉద‌యం నుంచి కొత్త‌గూడెం పోలీసులు ఎమ్మెల్యేతో ట‌చ్‌లో ఉన్నారు.  అయితే, పోలీసుల‌కు అప్ప‌గించే ముందు రాఘ‌వ మీడియాతో మాట్లాడేందుకు ప‌ట్టుబట్టాడు.  కానీ, మీడియా ముందుకు రాకుండానే రాఘ‌వ‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

Related Articles

Latest Articles