Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story West Bengal Cm Suvendu Adhikari First Cabinet Meeting Key Decisions

Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

Published Date :May 11, 2026 , 5:13 pm
By Suresh Maddala
  • బెంగాల్‌లో సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ
  • పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
  • కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎం సువేందు
Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆధ్వర్యంలో తొలి కేబినెట్ సమావేశం అయింది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచె నిర్మాణం కోసం 45 రోజుల్లో బీఎస్‌ఎఫ్‌కు భూములు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రజాకేంద్రీకృత పరిపాలన, భద్రత, సుపరిపాలన లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు.

సోమవారం నబన్నలో మంత్రులతో సువేందు అధికారి తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాక.. సువేందు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బెంగాల్ చరిత్రలో తొలిసారి ఎలాంటి హింస, బెదిరింపులు లేకుండా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేస్తామని, ఎన్నికల సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని ఎప్పటికీ మర్చిపోమని తెలిపారు. వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Also Read

  • TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
  • Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
  • CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
  • Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
Add as a preferred
source on google

నిర్ణయాలు ఇవే..
కేబినెట్ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచె నిర్మాణానికి 45 రోజుల్లో బీఎస్‌ఎఫ్‌కు భూముల బదిలీ, ఐఏఎస్, ఐపీఎస్, డబ్ల్యూబీపీఎస్ అధికారులపై రాష్ట్రం వెలుపల డిప్యూటేషన్, శిక్షణ కార్యక్రమాల పరిమితుల ఎత్తివేత, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అవకాశం కోల్పోయిన అభ్యర్థులకు ఐదేళ్ల వయో పరిమితి సడలింపు, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)ను తక్షణ అమలు చేయడం, ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన వంటి కేంద్ర పథకాల అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

‘‘45 రోజుల్లో బీఎస్‌ఎఫ్‌కు భూములు అప్పగిస్తాం. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది” అని సీఎం సువేందు అధికారి వెల్లడించారు. రాష్ట్ర అధికారులకు బయటి శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించడం ద్వారా పరిపాలనా సమన్వయం, సంస్థాగత అనుభవం పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ‘‘బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, ప్రజా అనుకూల పరిపాలన నిర్మాణానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం’’. అని సువేందు అధికారి స్పష్టం చేశారు.

మే 4న విడుదలైన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 294 స్థానాలకు గాను 207 స్థానాలు కమలం పార్టీ కైవసం చేసుకుంది. ఇక గత శనివారం ముఖ్యమంత్రిగాసువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటుదిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కిర్తానియా, ఖుదిరామ్ టుడు, నిశిత్ ప్రమాణిక్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Agnimitra Paul
  • Ayushman Bharat Bengal
  • Bengal Cabinet meeting
  • Bengal government news
  • Bengal latest news

తాజావార్తలు

  • Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

  • Crab Biryani Recipe : సీఫుడ్ ప్రియుల కోసం స్పెషల్ ‘పీతల బిర్యానీ’.. హోటల్ స్టైల్‌లో ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా.!

  • TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?

  • Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి

  • Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions