కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. అన్ని రాష్ట్రాలు కఠిన ఆంక్షలు.. కొన్ని రాష్ట్రాలు అయితే లాక్‌డౌన్ ప్రకటించి అమలు చేస్తున్నాయి.. అయితే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లాక్‌డౌన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోమని స్పష్టం చేశారు దీదీ.. ఇక, మే 1 నుంచి 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్‌పై కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో.. మే 5వ తేదీ నుంచి రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన అందరికీ వ్యాక్సిన్ ఇస్తామన్నారు.. కోవిడ్ కట్టడికి లాక్‌డౌన్ పరిష్కారం కాదని పేర్కొన్న దీదీ.. లాక్‌డౌన్ ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, ఇళ్ల నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.. కానీ, గత ఏడాది తరహాలో ప్రజలను వారి ఇంట్లోనే బంధించేందుకు తాను వ్యతిరేకమని.. లాక్‌డౌన్ పెట్టబోమని స్పష్టం చేశారు. మరోవైపు… బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఐదు విడుదల పోలింగ్ ముగియగా.. మరో మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.
లాక్‌డౌన్‌పై దీదీ ఆసక్తికర వ్యాఖ్యలు..
Mamata Banerjee