దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి వల్ల ఇప్పటికే చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. అయితే తాజాగా వెస్ట్ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ ఇంట కరోనా విషాదం నింపింది. ఇవాళ ఉదయం మమతా బెనర్జీ తమ్ముడు ఆషీమ్ బెనర్జీ కరోనా సోకి మృతి చెందారు. ఆషీమ్ బెనర్జీ కి కరోనా సోకడంతో.. అతన్ని కోలకతా లోని మెడికా ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందించారు. అయితే ఇవాళ ఆయన పరిస్థితి విషమించడంతో ఆషీమ్ బెనర్జీ మృతి చెందారు. దీంతో సిఎం మమతా బెనర్జీ ఇంట విషాదం నెలకొంది. కాగా వెస్ట్ బెంగాల్ లో గడిచిన 24 గంటల్లో 20,846 కొత్త కరోనా కేసులు నమోదవగా 136 మంది మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10, 94,802 కు చేరగా 12,993 కరోనా మరణాలు సంభవించాయి.
కరోనా కల్లోలం : మమతా బెనర్జీ ఇంట విషాదం
