Bride Leaves with Boyfriend: దేశవ్యాప్తంగా వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.. హనీమున్‌కి తీసుకెళ్లి ప్రియుడితో కలిసి భర్తను లేపేయడం.. పెళ్లి జరిగిన తర్వాత అనుమానం రాకుండా.. భర్తను వేసేయడం.. పెళ్లైనా చాలా కాలం తర్వాత కూడా ప్రియుడు కోసం భర్తను చంపి వెళ్లిపోవడం.. మొత్తంగా తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రేమించేవాడిని కలిసి బతికేందుకు.. ఇలా భర్తలను బలి చేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.. అయితే, ఓ పెళ్లి కూతురు.. ఉదయం పెళ్లి చేసుకుని.. సాయంత్రం రిసెన్షన్‌కు సిద్ధమవుతోన్న వేళ.. మధ్యాహ్నమే ప్రియుడితో జంప్ అయ్యింది..
చెన్నైలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిన్న ఉదయం 6 గంటలకు మాధవరం బర్మా కాలనీ ప్రాంతానికి చెందిన విజయకుమార్ అనే వ్యక్తికి పెరంబూరులోని అంబేద్కర్ నగర్‌కు చెందిన అర్చనకు బెసెంట్ నగర్ చర్చిలో వివాహం జరిగింది.. పెళ్లి తర్వాత కొత్త జంట ఇంటికి వచ్చింది.. అయితే, సాయంత్రం జరగనున్న రిసెప్షన్ కోసం తాను బ్యూటీ పార్లర్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన అర్చన.. ఎంతకీ రాకపోవడంతో అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టారు.. కానీ, బ్యూటీ పార్లర్ వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లిన అర్చన.. తన ప్రియుడు కలైతో కలిసి వెళ్లిపోయినట్టుగా గుర్తించారు..
Read Also: IND vs ENG: ఇంగ్లాండ్ ఆలౌట్.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
దీనిపై తిరువిగ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు అర్చన తల్లి నాగవల్లి.. దీంతో, పోలీసులు రంగంలోకి దిగగా.. సాయంత్రం తిరువిగనగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అర్చన.. తాను వివాహం చేసుకున్న విజయకుమార్‌కు క్షమాపణ చెప్పి ప్రియుడు వెళ్లిపోయింది.. అయితే, ముందే ఈ విషయం చెబితే ఇంత వరకు వచ్చేవాళ్లం కాదు కదా.? అని పెళ్లి కొడుకు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.. ఎంగేజ్‌మెంట్, వివాహ తంతుకు అయిన ఖర్చులు ఎవరు బరిస్తారని మండిపడ్డారు.. దీంతో, వివాహ ఖర్చులకు తగిన పరిహారం అందిస్తామని అర్చన కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు.. అయితే, ఈ ఘటనపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.. తన భార్య, ప్రియుడి చేతిలో హత్యకు గురికాకుండా.. విజయ్‌కుమార్ బతికిపోయాడని కామెంట్ చేస్తున్నారు.
