Family Court: మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఒక ఫ్యామిలీ కోర్టు విడాకుల కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. సదరు మహిళను తక్షణమే భర్త ఇంటికి తిరిగిరావాలని కోరింది. ఆచారబద్ధమైన సింధూరం ధరించడం హిందూ స్త్రీ విధి అని.. అది పెళ్లయినట్లు తెలియజేస్తుందని వ్యాఖ్యానించింది. తన భార్య పెళ్లైన ఐదేళ్ల తర్వాత వెళ్లిపోయిందని, హిందూ వివాహ చట్టం కింద తన హక్కులను పునరుద్ధరించాలని కోరతూ ఓ వ్యక్తి ఇండోర్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని ప్రిన్సిపల్ జడ్జ్ ఎన్పీ సింగ్ విచారించారు.
Read Also: Maruti Suzuki: 16,000 కార్లను రీకాల్ చేసిన మారుతి సుజుకి..
మార్చి 1న సదరు మహిళ తన వాంగ్మూలాన్ని నమోదు చేసిన సమయంలో, బొట్టు పెట్టుకోలేదని అంగీకరించింది. బొట్టు పెట్టుకోవడం అనేది భార్య మతపరమైన విధి అని, ఇది స్త్రీకి పెళ్లైనట్లు చూపిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. మహిళ పిటిషన్ పరిశీలించిన తర్వాత ఆమె తన భర్తను విడిచిపెట్టలేదని, ఆమె అతని నుంచి విడాకులు కోరుతున్నట్లు స్పష్టమైందని కోర్టు ఆర్డర్ పేర్కొంది. తన భర్తను వరకట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని మహిళ ఆరోపించింది. రెండు వైపుల వాదనలు విన్న కోర్టు.. మహిళ తన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి పోలీస్ ఫిర్యాదు సమర్పించలేదని కోర్టు తెలిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది శుభం శర్మ మాట్లాడుతూ, తన క్లయింట్‌కు 2017లో వివాహం జరిగిందని, దంపతులకు 5 ఏళ్ల కుమారుడు ఉన్నాడని చెప్పాడు.
హిందూ వైవాహిక సంప్రదాయాల ప్రకారం బొట్టు పెట్టుకోవడానికి భార్య నిరాకరించడం తన భర్త పట్ల క్రూరత్వంగా పరిగణించబడుతుందని ఇండోర్ ఫ్యామిలీ కోర్టు చెప్పింది. విచారణ సమయంలో భార్య విడిపోవడానికి సంతృప్తికరమైన కారణాన్ని అందించడంలో విఫలమైందని కోర్టు తెలిపింది. భర్త వరకట్నం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, వేధింపులకు పాల్పడుతున్నాడన్న భార్య వాదనలకు సంబంధించిన సరైన ఆధారాలు లేవని, భర్త వద్దకు తిరిగి రావాలని భార్యను ఆదేశించింది.