Site icon NTV Telugu

Jharkhand Elections: “మేం బీజేపీకే ఓటేస్తాం”.. సీఎం భార్య నియోజకవర్గంలో ‘‘పప్పూ‌’’కి చేదు అనుభవం..

Pappu Yadav

Pappu Yadav

Jharkhand Elections: రేపు జార్ఖండ్ చివరి దశ ఎన్నికలు జరగబోతున్నాయి. జార్ఖండ్‌లోని 38 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరుగనున్నాయి అయితే, ఇప్పుడు బీహార్ పూర్నియా నుంచి పోటీ చేసి గెలుపొందిన ‘‘పప్పూ యాదవ్’’ ప్రచారం వైరల్‌గా మారింది. ఇండియా కూటమి తరుపున ఓట్లు అడుగుతున్న ఆయనకు స్థానికుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. జార్ఖండ్ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తీ మోర్చా(జేఎంఎం)కి ఓటు వేయాలని ప్రచారం నిర్వహించిన వీడియో వైరల్‌గా మారింది.

Read Also: Upcoming EV’s: త్వరలో మార్కెట్లోకి రానున్న 5 బెస్ట్ SUVఈవీలు ఇవే.. ఇంకెందుకు ప్లాన్ చేసుకోండి

సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ గండేయ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జేఎంఎంకి ఓటేయాలని ప్రజల్ని పప్పూ యాదవ్ అభ్యర్థించారు. ఈ వీడియోలో ‘‘ మేము బీహార్ నుంచి ఇక్కడి వచ్చాము. మీ నుంచి ఆశీర్వాదాలు కోరుతున్నాము’’ అని పప్పూ యాదవ్ చెబుతుండటం వినొచ్చు. మీరు ఆశీర్వదిస్తారా..? అని ఓటర్లను ప్రశ్నించారు. ఈ సమయంలో ఓ అమ్మాయి ‘‘మేము మీకు ఓటేయం, బీజేపీకి ఓటు వేస్తాం’’ అని చెప్పింది. ఈ వీడియోను బీజేపీ నేత నిశికాంత్ దూబే తన ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు.

మీరు బీజేపీకి ఎందుకు ఓటేయరు..? అని పప్పూ యాదవ్ ప్రశ్నించగా.. ‘‘ఇన్ని రోజులు మీ జేఎంఎం ఏం చేసిందని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లు కావస్తోంది, ఏం చేసింది?’’ అని ప్రశ్నించింది. దీని తర్వాత పప్పూ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ ఏం చేసింది..? అని ప్రశ్నించారు. బీజేపీ చాలా చేసిందని, రామ మందిరాన్ని నిర్మించిందని అమ్మాయి చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Exit mobile version