Rahul Gandhi: మహారాష్ట్రలో బీజేపీ నకిలీ ఓట్లను సృష్టించి, ఫలితాలను తారుమారు చేయడానికి వాటిని ఉపయోగించుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన ఎన్నికల సంఘం బీజేపీ ఆదేశాల మేరకు పని చేస్తోందని ఆరోపించారు. 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగింది.. కానీ, త్వరలో బీహార్‌లో జరిగే ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలను పునరావృతం చేయాలని కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ట్రై చేస్తుందని ఆరోపించారు. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సవరణ ద్వారా ప్రజల నుంచి ఓటు హక్కును లాగేసుకునేందుకు కుట్ర చేస్తుందని రాహుల్ గాంధీ విమర్శించారు.
Read Also: Mega PTM in AP: నేడు ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్.. గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో ఈవెంట్..!
అయితే, బీజేపీ నామినేట్ చేసిన ఎన్నికల కమిషనర్లు ఆ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజల ఓట్లను, ముఖ్యంగా యువతను ఓట్లును దొంగిలించడానికి ఈసీ తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు, ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పార్టీలా మారిందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. ఓటర్ లిస్ట్ నుంచి పేర్లను తొలగించి, వారికి రేషన్, పెన్షన్ ఇవ్వడం లేదని నితీష్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడక తప్పదని తేల్చి చెప్పారు.
