Site icon NTV Telugu

Vladimir Putin: భారతీయ సినిమాలు అంటే రష్యన్లకు ఎంతో ఇష్టం..

Pm Modi, Putin

Pm Modi, Putin

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతీయ సినిమాల గురించి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. రష్యాలో ఇండియన్ సినిమాలకు చాలా ఆదరణ ఉందని చెప్పారు. ‘‘మేము భారతీయ సినిమాను ప్రేమిస్తున్నాము’’ అని సోచి నరగంలో జరిగిన వాల్డాయ్ చర్చ వేదికపై నుంచి పుతిన్ అన్నారు. భారతదేశం కాకుండా, భారతీయ సినిమాలను పగలు రాత్రి ప్రసారం చేయడానికి ప్రత్యేకమైన టెలివిజన్ ఛానెల్ ఉన్న ఏకైక దేశం రష్యా అని పుతిన్ చెప్పుకొచ్చారు.

Read Also: Cyclone Effect: తుఫాన్ ఎఫెక్ట్.. వందల ఎకరాల అరటి తోటలు నేలమట్టం

రాజకీయాలు, దౌత్యానికి మించి సాంస్కృతిక, మానవతా సంబంధాలకు సంబంధాలు విస్తరించాయని పుతిన్ కూడా నొక్కి చెప్పారు. చాలా మంది భారతీయ విద్యార్థులు రష్యాలో చదువుతున్నారని, రష్యా, రష్యన్ ప్రజలు భారతీయ సంస్కృతిని, ముఖ్యంగా సినిమాను ఆదరిస్తారని ఆయన చెప్పారు.

పుతిన్ వ్యాఖ్యలు భారత్-రష్యాల మధ్య ఉన్న సంబంధాలను హైలెట్ చేశాయి. సోవియట్ కాలం నుంచి రష్యాలో భారతీయ చిత్రాలు ఆదరణ పొందుతున్నాయి. రాజ్‌కపూర్, మిథున్ చక్రవర్తి వంటి తారలకు అక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది. 1982లో మిథున్ చక్రవర్తి నటించిన డిస్కో డాన్సర్ సినిమా సోవియట్ యూనియన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. రాజ్ కపూర్ 1951లో వచ్చిన ఆవారా సినిమాతో పాటు, విదేశాల్లో 100 మిలియన్లకు పైగా టిక్కెట్లు అమ్ముడైన రెండు భారతీయ చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది.

Exit mobile version