Site icon NTV Telugu

BJP MP: “ఒకే వైపు వెళ్తున్నాం”.. శశిథరూర్‌తో బీజేపీ నేత ఫోటో వైరల్..

Shashi Tharoor

Shashi Tharoor

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యవహారం ఆ పార్టీలో సంచలనంగా మారింది. ఇటీవల పలు సందర్భాల్లో శశి థరూర్ కాంగ్రెస్ వ్యవహార శైలిపై కఠినంగా మాట్లాడారు. దీనికి తోడు కేరళలో సీపీఎం ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్రమోడీ దౌత్య విధానంపై ప్రశంసలు కురిపించారు. గతంలో, పార్టీ తనను పట్టించుకోకుంటే, తనకు వేరే ఆప్షన్లు కూడా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో త్వరలోనే థరూర్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.

Read Also: Deputy CM Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ భుజం ఎక్కిన బుడ్డోడు.. వాడి సంతోషం చూడండి..!

ఇదిలా ఉంటే, తాజాగా బీజేపీ నేత బైజయంత్ ‘‘జై’’ పాండా సోషల్ మీడియా పోస్ట్ ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. శశిథరూర్‌తో దిగిన ఫోటోని పాండా ఎస్ఎంలో పోస్ట్ చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీలో మరింత ఉద్రిక్తతను పెంచింది. బీజేపీ ఉపాధ్యక్షుడు అయిన పాండా, ‘‘చివరకు ఒకే దిశలో ప్రయాణిస్తున్నాం’’ అని ఈ ఫోటోని షేర్ చేసి కామెంట్ చేశారు. అయితే దీనికి శశిథరూర్ వెంటనే స్పందించారు. తాను భువనేశ్వర్ వెళ్తున్నానని, ఆయన తన తొటి ప్రయాణికుడు అని అన్నారు.

ఇటీవల, ప్రధాని మంత్రి మోడీ దౌత్యవ్యూహాలపై థరూర్ ప్రశంసలు కరిపించారు. మోడీ ఒకే సమయంలో రష్యా, ఉక్రెయిన్ దేశాల అధ్యక్షులతో స్నేహం చేస్తున్నారని, మొదటి దీనిని మూర్ఖంగా తాను వ్యతిరేకించానని ఇటీవల అన్నారు. థరూర్ వ్యాఖ్యల్ని బీజేపీ నేతలు స్వాగతించారు.

Exit mobile version