NTV Telugu Site icon

Delhi: అమిత్ షాను కలిసిన ప్రియాంకాగాంధీ.. దేనికోసమంటే..!

Priyankagandhi

Priyankagandhi

వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ నేతృత్వంలోని కేరళ ఎంపీల బృందం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అమిత్ షాకు వినతి పత్రాన్ని అందించారు.

సమావేశం అనంతరం ప్రియాంక మీడియాతో మాట్లాడారు.. వయనాడ్ విలయం కారణంగా పూర్తి విధ్వంసమైందన్నారు. సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకోవాలని ప్రధాని మోడీని, హోంమంత్రి అమిత్ షాను కోరినట్లు తెలిపారు. నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు బాధితులకు ఎలాంటి సాయం అందలేదన్నారు. బాధితులకు ఎలాంటి సందేశాన్ని పంపిస్తున్నారని పశ్నించారు. రాజకీయాలకు అతీతంగా సాయం అందించాలని కోరారు. కేరళ ఎంపీలందరి తరపున ఇచ్చిన వినతిని సీరియస్‌గా తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు ప్రియాంక తెలిపారు.

జూలై 30న వయనాడ్‌లో భారీ విపత్తు సంభవించింది. కొండచరియలు విరిగిపడి 231 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలపై గురువారం సాయంత్రంలోగా అప్‌డేట్‌ చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. పుంఛిరిమట్టం, చూరల్‌మల, ముండక్కై మూడు గ్రామాల్లో విస్తృతమైన నష్టాన్ని మిగిల్చాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ బాధిత ప్రాంతాల్లో పర్యటించినప్పటికీ ఇంతవరకు చెప్పుకోదగ్గ సాయం అందలేదని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.

 

Show comments