Wayanad landslides: 130 మంది జాడ మిస్సింగ్.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
- వయనాడ్ విలయంలో 130 మంది జాడ మిస్సింగ్
- కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయనాడ్ విలయం ఇంకా కళ్ల ముందు మెదలాడుతూనే ఉంది. విపత్తు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వందిలాది మంది గల్లంతయ్యారు. ఇంకొందరు క్షతగాత్రులయ్యారు. ఆప్తులను కోల్పోయిన బాధితుల ఎంతో మంది ఉన్నారు. ఈ విషాదాన్ని గుర్తుచేసుకుంటేనే ఇంకొందరికి కన్నీళ్లు వస్తున్నాయి. ఈ ఘటన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా స్పందించి సహాయ చర్యలు చేపట్టారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 200లకు పైగా మృతదేహాలను గుర్తించగా.. 130 మంది ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు పేర్కొన్నారు. రెండు వారాలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉందన్నారు. గల్లంతైన వారి కోసం చలియార్ నది, పరిసర అటవీ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Dr. Gadala Srinivas Rao: మాజీ హెల్త్ డైరెక్టర్ వీఆర్ఎస్ ఆమోదం.. ఉత్తర్వులు జారీ
Also Read
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
జులై 30న వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 229 మంది చనిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వీరిలో 51 మందిని ఇంకా గుర్తించాల్సి ఉందని తెలిపింది. వీరికి సంబంధించిన డీఎన్‌ఏ నివేదిక ఆగస్టు 13లోగా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు దాదాపు 130 మంది ఆచూకీ ఇంకా లభించలేదని ప్రభుత్వం వెల్లడించింది. వీరికోసం గడిచిన రెండు వారాలుగా ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ఎన్డీఆర్‌ఎఫ్, పోలీస్, అగ్నిమాపక, అటవీశాఖలకు చెందిన 190 మంది సభ్యుల బృందం.. వరదలు చోటుచేసుకున్న ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయని తెలిపారు.
సమీప అడవులపై దృష్టిసారించినట్లు ఏడీజీపీ ఎం ఆర్ అజిత్ కుమార్ పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలను ఇప్పటికే ఒకసారి గాలించామని, తాజాగా నది, దాని తీర ప్రాంతాలపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. ఎగువ ప్రాంతం మొత్తం పూర్తికాగా, ప్రస్తుతం దిగువన తమ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు.
ఇది కూడా చదవండి: Dr. Gadala Srinivas Rao: మాజీ హెల్త్ డైరెక్టర్ వీఆర్ఎస్ ఆమోదం.. ఉత్తర్వులు జారీ
తాజావార్తలు
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఇండియా తుది జట్టు ఇదే..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..