Site icon NTV Telugu

Child Pornography Case: నేడు ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు

Supreme

Supreme

Child Pornography Case: ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈరోజు (సోమవారం) సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం.. ఛైల్డ్‌ పోర్నోగ్రఫీని చూడటం తప్పేమీ కాదంటూ మద్రాస్‌ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు దారుణమైందని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది.

Read Also: Ramappa Temple: రామప్ప గొల్లాల గుడిలో దారుణం.. గుప్త నిధుల కోసం శిల్పాలు ధ్వంసం..

అయితే, ఛైల్డ్‌ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్‌ చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిపై క్రిమినల్‌ చర్యలను నిలిపి వేస్తూ జనవరి 11వ తేదీన మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక, ఆరోపణలు ఎదుర్కొంటున్న 28 ఏళ్ల యువకుడు వీడియోలు చూడటం తప్ప ఏమీ చేయలేదని తెలిపింది. వాటిని ఇతరులకూ పంపలేదని కోర్టు ఆ సందర్భంగా చెప్పుకొచ్చింది. పోర్నోగ్రఫీకి అలవాటుపడిన యువతను శిక్షించడం కన్నా వారిని సరైన మార్గం వైపు నడిపించడంపై దృష్టి సారించాలని మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది.

Exit mobile version