NTV Telugu Site icon

Sanjay Raut: ‘‘మోడీ బౌలింగ్.. అమిత్ షా బ్యాటింగ్’’.. సంజయ్ రౌత్ సెటైర్లు..

Sanjay Raut

Sanjay Raut

Sanjay Raut: ఈ రోజు జరుగుతున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పై యావత్ భారత్ ఆశలు పెట్టుకుంది. ఇండియన్ ఫ్యాన్స్ రోహిత్ సేన వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటున్నారు. అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచు కోసం లక్షలాది మంది చేరుకున్నారు. దీనికి తోడు ప్రధాని మోడీతో పాటు ఆస్ట్రేలియన్ డిఫ్యూటీ పీఎం, విదేశీ రాయబారులు, బాలీవుడ్ సెలబ్రెటీలు వస్తున్నారు. దీంతో స్టేడియంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read Also: PM MODI: 140 కోట్ల మంది మీ వెంటే.. టీమిండియాకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

ఇదిలా ఉంటే క్రికెట్ మ్యాచుని ప్రస్తావిస్తూ శివసేన(ఉద్ధవ్) వర్గం నేత, ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీపై సెటైర్లు వేశారు. ‘‘మోడీ బౌలింగ్ చేస్తారు, అమిత్ షా బ్యాటింగ్ చేస్తారు, బీజేపీ లీడర్స్ బౌండరీ దగ్గర నిలబడుతారు. వారు ప్రధాని మోడీ అక్కడ ఉన్నందువల్లే ప్రపంచకప్ గెలిచారని చెప్పుకుంటారు.’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ సంఘటన రాజకీయంగా మారుతోందని రౌత్ అన్నారు. మరణమైనా, క్రీడాపోటీలైనా, అంతా రాజకీయంగా మారిందని అన్నారు. ఈ రోజుల్లో ఈ దేశంలో ఏదైనా జరుగుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.