Flight Delay: పొగమంచు, వాతావరణ పరిస్థితులు దేశంలో విమానయానాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి ఢిల్లీలో పొగమంచు పరిస్థితులు వందల సంఖ్యలో విమానాల రాకకు అంతరాయాన్ని కలిగించాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా అవస్థలు పడ్డారు. ఏకంగా కొందరు ప్రయాణికలు విమాన సిబ్బందిపై దాడులు చేయడమే చేయడం, ప్రయాణికులు విమానం పక్కనే నేలపై కూర్చుని భోజనం చేయడం వైరల్‌గా మారాయి.
Read Also: World War-3: మూడో ప్రపంచ యుద్ధాన్ని రష్యానే ప్రారంభిస్తుంది.. సంచలనంగా జర్మన్ రహస్య పత్రాలు..
ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. కేంద్రమంత్రి జోతిరాదిత్య సింధియా ఈ నిబంధనలను వెల్లడించారు.
1) దేశంలోని 6 మెట్రో ఎయిర్‌పోర్టుల్లో (ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూర్) చోటు చేసుకునే సంఘటనల్ని రోజుకు మూడు సార్లు కేంద్రానికి తెలియజేయాలి.
2) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మార్గదర్శకాలు, నిబంధనల అమలును నిరంతరం పర్యవేక్షించి వాటిపై నివేదిక తీసుకోనున్నారు.
3) ప్రయాణికులు అసౌకర్యానికి సంబంధించి ఏవైనా సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి విమానాశ్రయాలు మరియు ఎయిర్‌లైన్ ఆపరేటర్లు అన్ని ఆరు మెట్రోలలో ‘వార్ రూమ్‌లు’ ఏర్పాటు చేయనున్నారు.
4) తగినంత సీఐఎస్ఎఫ్ సిబ్బందిని ఎయిర్‌పోర్టుల్లో మోహరించనున్నారు.
5) ఢిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టులో రన్ వే 29L CAT III మంగళవారం నుంచి కేటగిరీ 3 ఆపరేషన్స్‌కి అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు.
