NTV Telugu Site icon

Rahul Gandhi: “కులగణన”తో బీహార్ ప్రజలను మోసం చేశాడు.. నితీష్‌పై రాహుల్ గాంధీ ఆరోపణ

Ajay Maken

Ajay Maken

Rahul Gandhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్‌‌తో పొత్తుపై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో ఆప్‌తో పొత్తు ఉండకూడదని కోరుకున్నానని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల తర్వాత ఆప్‌కి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా అని ప్రశ్నించినప్పుడు.. 2013లో ఆప్‌కి కాంగ్రెస్ నుంచి ఎలాంటి మద్దతు ఉండకూడదని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఎలాంటి పొత్తు ఉండొద్దని భావించానని, అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.

Read Also: Rahul Gandhi: “కులగణన”తో మోసం.. నితీష్‌ కుమార్‌పై రాహుల్ గాంధీ ఆరోపణ

కేజ్రీవాల్ ‘‘జాతి వ్యతిరేకి’’ అని గతంలో తాను చేసని వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నట్లు మాకెన్ చెప్పారు. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం, 2024లో కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఢిల్లీ ప్రజలు నష్టపోయారని ఆయన అన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ఫేమస్ అవ్వడం బీజేపీకి సాయపడుతుందని, బీజేపీతో పోరాడాలంటే జాతీయ స్థాయిలో బలమైన కాంగ్రెస్ ముఖ్యమని అన్నారు. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ బలంగా లేకపోతే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటం కష్టమని చెప్పారు. కాంగ్రెస్‌ని బలహీనపరచడం ద్వారా బీజేపీతో పోరాడలేరు అని అన్నారు.

ఢిల్లీలో బీజేపీతో పోరాడటంలో ఆప్ విఫలమైందని ఆరోపించారు. హర్యానా, ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్‌తో పొత్తు పెట్టుకోవాలని అనునకుందని, కానీ జైలు నుంచి విడుదల కాగానే, హర్యానాలో 90 స్థానాల్లో పోటీ చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారని చెప్పారు. ఢిల్లీ విషయానికి వస్తే ఒంటరిగా పోటీ చేస్తామని ముందుగా ఆప్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీలో షీలా దీక్షిత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో అన్ని పార్లమెంట్ స్థానాలను కూడా కాంగ్రెస్ గెలిచి బీజేపీని అడ్డుకున్నామని చెప్పారు. ఆప్ మాత్రం బీజేపీని గెలవకుండా అడ్డుకోలేకపోయిందని అన్నారు.