NTV Telugu Site icon

Wall Collapse: విషాదం.. భారీ వర్షం కారణంగా గోడకూలి 9 మంది దుర్మరణం

Lucknow Wall Collapse

Lucknow Wall Collapse

Wall Collapse: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో విషాదం నెలకొంది. లక్నోలో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షానికి గోడ కూలి ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందారు. మరో పది మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సివిల్‌ ఆస్పత్రికి తరలించగా.. వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Supreme Court: ఉక్రెయిన్ విద్యార్థుల మెడికల్ ఎడ్యుకేషన్‌పై ఇవాళ సుప్రీంలో విచారణ

గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురువడం వల్లే గోడ కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఆ గోడ పక్కనే ఉన్న గుడిసెల్లో నివసిస్తున్న తొమ్మిది మంది బలయ్యారని తెలిపారు.ఈ విషాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముఖ్యమంత్రి మరణించిన వారికి రూ.4లక్షలు, గాయపడిన వారి చికిత్స కోసం రూ.2లక్షల పరిహారాన్ని ప్రకటించారు. గత 24 గంటల్లో నగరంలో 155.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లక్నో సాధారణంగా మొత్తం సెప్టెంబర్ నెలలో పొందే సగటు 197 మి.మీ. అసాధారణంగా కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది.

Show comments