NTV Telugu Site icon

Ratan Tata: “బాధ్యతతో ఓటేయండి”.. ముంబై వాసులకు రతన్ టాటా పిలుపు..

Ratan Tata

Ratan Tata

Ratan Tata: ముంబైలోని అన్ని నియోజకవర్గాలకు మే 20న పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబై వాసులకు కీలక విజ్ఞప్తి చేశారు. ముంబై వాసులంతా బాధ్యతతో ఓటేయాలని కోరారు. ఐదో దశలో ముంబైతో పాటు దేశంలోని 49 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ‘‘సోమవారం ముంబైలో ఓటింగ్ రోజు. ముంబైవాసులందరూ బయటకు వెళ్లి బాధ్యతాయుతంగా ఓటు వేయాలని నేను కోరుతున్నాను’’ అని రతన్ టాటా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ముంబైలోని పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ కూడా ముంబై వాసులను సోమవారం బయటకు వచ్చి ఓటు వేయాలని కోరారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఓటు ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. తాను ఏడాదిలో ఏ రోజు కూడా వ్యాయామాన్ని మిస్ కానని, అలాగే మే 20 ఓటు వేసే అవకాశాన్ని కూడా కోల్పోనని అన్నారు. ‘‘కాబట్టి మీరు ఏమి చేయాలనుకుంటే అది చేయండి, కానీ వెళ్లి ఓటు వేయండి, మీ భారత్ మాతాను ఇబ్బందుల్లోకి నెట్టొద్దు .. భారత్ మాతా కీ జై అని’’ అంటూ శుక్రవారం ట్వీట్ చేశారు.

Read Also: Husband Killed Wife: దారుణం.. భార్యను అతికిరాతకంగా రోకలిబండతో కొట్టి చంపిన భర్త

ముంబైలోని 6 స్థానాలైన ముంబై నార్త్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై నార్త్ ఈస్ట్, ముంబై నార్త్ సెంట్రల్, ముంబై సౌత్ మరియు ముంబై సౌత్ సెంట్రల్‌లకు ఐదో విడతలో మే 20న ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్రలోని ఇతర నియోజకవర్గాలైన ధూలే, దిండోరి, నాసిక్, కళ్యాణ్, పాల్ఘర్, భివాండి, థానేలకు కూడా ఇదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ తర్వాత దేశంలో ఎక్కువగా ఈ రాష్ట్రం నుంచి ఎంపీ స్థానాలు ఉండటంతో అన్ని పార్టీలు ముమ్మర ప్రచారం చేశాయి. ఈ రోజు సాయంత్రంలో ఐదో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. కౌంటింగ్ మరియు ఫలితాలు జూన్ 4 న ప్రకటించబడతాయి.