NTV Telugu Site icon

Putin: మసీదులో ఖురాన్‌ను ముద్దుపెట్టుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్

Putin

Putin

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెచ్న్యాలో పర్యటించారు. ఈ సందర్భంగా మసీదును సందర్శించారు. మసీదులో బంగారంతో పొదిగిన ఖురాన్ కాపీని ముద్దుపెట్టుకున్నారు. అనంతరం ఇస్లాం పవిత్ర గ్రంథంతో ఫొటోలకు పోజులిచ్చారు. పర్యటనలో భాగంగా పుతిన్.. చెచ్న్యా నాయకుడు రంజాన్ కదిరోవ్‌తో సమావేశం అయ్యారు.

దాదాపు 13 ఏళ్ల తర్వాత తొలిసారిగా రష్యా అధ్యక్షుడు పుతిన్.. మంగళవారం ముస్లింలు అత్యధికంగా ఉండే చెచ్న్యాలో పర్యటగించారు. ఉక్రెయిన్‌తో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ పుతిన్ మసీదు సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 14 సెకన్ల పాటు ఉన్న వీడియో వైరల్ అవుతోంది. మసీదును సందర్శించిన తర్వాత ఖురాన్‌ను చేతులతో పట్టుకుని చూసి.. అనంతరం దాన్ని ముద్దు పెట్టుకున్నారు. అనంతరం చెచ్న్యా నాయకుడు రంజాన్ కదిరోవ్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో యుద్ధం గురించి చర్చించారు. కదిరివ్‌ పేరు మీద ప్రత్యేక దళాల అకాడమీ ఉంది. ఉక్రెయిన్‌లో మోహరింపు కోసం సిద్ధమవుతున్న స్వచ్ఛంద యోధులతో పుతిన్ సంభాషించారు.

ఉక్రెయిన్-రష్యా మధ్య గత రెండేళ్ల నుంచి యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక ప్రధాని మోడీ గురువారం ఉక్రెయిన్‌కు వెళ్తున్నారు. పోలాండ్ నుంచి ట్రైన్‌లో కీవ్‌కు వెళ్లనున్నారు. ఈ పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.