విస్తారా ముంబై-ఫ్రాంక్‌ఫర్ట్ విమానంలో భద్రతా లోపాలు తలెత్తాయి. దీంతో విమానాన్ని టర్కీకి మళ్లించారు. ముంబై నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్లాల్సిన UK27 విమానం భద్రతా కారణాల దృష్ట్యా టర్కీలోని ఎర్జురం విమానాశ్రయానికి మళ్లించబడిందని ఎయిర్‌లైన్ ఎక్స్‌లో తెలిపింది.
ఇది కూడా చదవండి: IT Companies: ఆగస్టులో 27 వేల మందికి పైగా ఐటీ ఉద్యోగాలు ఊస్ట్!
కమర్షియల్ క్యారియర్ విస్తారా భద్రతా కారణాల దృష్ట్యా ముంబై-ఫ్రాంక్‌ఫర్ట్ విమానాన్ని శుక్రవారం టర్కీకి మళ్లించిందని ఎయిర్‌లైన్ ఎక్స్‌లో పోస్ట్‌లో తెలిపింది. రాత్రి 7:05 గంటలకు ఎర్జురం విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయబడిందని ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. విమానంలో ఎలాంటి భద్రతా కారణాలు తలెత్తాయన్న విషయాన్ని మాత్రం ఎయిర్‌లైన్స్ వెల్లడించలేదు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది. అయితే దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Vinesh Phogat: వినేష్ ఫోగట్ సీటు కేటాయించిన కాంగ్రెస్.. పోటీకి దూరంగా బజరంగ్!
విమానయాన సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. విమానంలోని సిబ్బంది భద్రతా ఆందోళనను గుర్తించారని, ఆ తర్వాత సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పారు. సిబ్బంది భద్రతా లోపాలను గుర్తించిన తర్వాతే విమానాన్ని టర్కీకి మళ్లించినట్లు వెల్లడించారు. ప్రోటోకాల్ ప్రకారం సంబంధిత అధికారులు అప్రమత్తం అయ్యారని.. సురక్షితంగా విమానం ల్యాండ్ అయిందని తెలిపారు. ప్రయాణికుల భద్రతే తమ ప్రాధాన్యత అని చెప్పుకొచ్చారు. భద్రతా తనిఖీలకు ఏజెన్సీలకు సహకరిస్తామని చెప్పారు.
ఈ మధ్య విమానాలు గగనతలంలో ఇబ్బందులకు గురవుతున్నాయి. ఆ మధ్య ఓ విమానం భారీ కుదుపులకు గురైంది. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. పలువురు గాయపడ్డారు. ఈ పరిణామంతో ప్యాసింజర్స్ షాక్‌కు గురయ్యారు. తాజాగా విస్తారా విమానంలో కూడా సమస్యలు తలెత్తినట్లుగా కనిపిస్తోంది. అయితే దీనిపై ఎయిర్‌లైన్స్ సమాచారం ఇవ్వాల్సి ఉంది.
https://twitter.com/airvistara/status/1832054036322984138
