Site icon NTV Telugu

Viral Video: ఫ్లూయెంట్ ఇంగ్లీష్‌తో అదరగొట్టిన మహిళా సర్పంచ్.. షాక్‌తో చూస్తుండిపోయిన ఐఏఎస్ టీనా దాబీ..

Tina Dabi

Tina Dabi

Viral Video: సాంప్రదాయ రాజస్థానీ వేషధారణలో ఉన్న ఓ మహిళా సర్పంచ్ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతుండటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్ బార్మర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో గౌరవ అతిథిగా వచ్చిన ఐఏఎస్ అధికారిణి టీనా దాబీ ముందు సర్పంచ్ ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ మాట్లాడారు. దీంతో టీనా దాబీ కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల టీనా దాబీ బార్మర్ జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.

Read Also: Chandrababu Naidu: వరదలతో నష్టపోయిన ప్రజలకు అందించే సాయంపై నేడే సీఎం చంద్రబాబు ప్రకటన..

సర్పంచ్ సోను కన్వర్ రాజస్థానీ సంప్రదాయ దుస్తులు ధరించి వేదికపై నిలబడి కలెక్టర్‌కు స్వాగతం పలికారు. ‘‘ఈ రోజులో భాగమైనందుకు నేను సంతోషిస్తున్నాను. ముందుగా మా కలెక్టర్ టీనా మేడమ్‌కి స్వాగతం పలుకుతాను. ఒక మహిళగా టీనా మేడమ్‌ని స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని ప్రసంగించారు. నీటి సంరక్షణపై సర్పంచ్ సోనూ కన్వర్ చేసిన ప్రసంగం, ఆమె ఇంగ్లీష్ నైపుణ్యానికి గ్రామస్తులతో పాటు టీనా దాబీ కూడా ముగ్ధురాలైంది.

2015లో యూపీఎస్‌సీ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియాలో తొలి స్థానం సాధించి టీనా దాబీ చరిత్ర సృ‌ష్టించారు. ఆమె చెల్లెలు రియా దాబీ కూడా 2020లో UPSCలో ఆల్ ఇండియా ర్యాంక్ 15తో ర్యాంక్ సాధించింది. టీనా దాబీ జైపూర్‌లో ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కమిషనర్‌గా పనిచేస్తున్నారు, ఈ నెల ప్రారంభంలో బార్మర్‌కు జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆమె గతంలో జైసల్మేర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. టీనా బర్త ప్రదీప్ గావాండే జలోర్‌కి బదిలీ అయ్యారు.

Exit mobile version