Site icon NTV Telugu

Student Massaging Teacher: క్లాస్‌రూమ్‌లో టీచర్‌కు విద్యార్థి మసాజ్.. వీడియో వైరల్

Student Massaging Teacher

Student Massaging Teacher

Student Massaging Teacher: ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు విద్యార్థితో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెను సస్పెండ్ చేశారు. ఈ ఘటన పోఖారీ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల జరిగింది. పాఠశాల సమయంలో ఒక విద్యార్థి ఆమె పక్కన నిలబడి ఆమె చేతికి మసాజ్ చేస్తుండగా.. ఉపాధ్యాయురాలు కుర్చీపై విశ్రాంతి తీసుకుంటున్నట్లు వీడియోలో కనిపించింది. మరికొందరు పిల్లలు తమ పనులు తాము చేసుకుంటూ కనిపిస్తారు. క్లాస్‌రూమ్‌లో ఉన్న ఎవరో ఈ వీడియోను చిత్రీకరించారు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది.

Snake In Train: రైలులో పాము.. చివరకు ఏం జరిగిందంటే…

బాలుడు ఆమె ఎడమ చేతికి మసాజ్ చేస్తున్నప్పుడు టీచర్ బాటిల్‌తో నీరు తాగడం కనిపిస్తుంది. మసాజ్ చేస్తూ ఉండగా.. ఆ టీచర్ తరగతి గదిలోని ఇతర పిల్లలపై అరుస్తూ కనిపించింది. ఆ ఉపాధ్యాయురాలిని ఊర్మిళా సింగ్‌గా గుర్తించారు. ఆమె బవాన్ బ్లాక్‌లోని పోఖారీ ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తోంది. వీడియో వైరల్ కావడంతో ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లగా… విచారణ ప్రారంభించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారిని కోరారు. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నుంచి నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Exit mobile version