Site icon NTV Telugu

Police Fighting: మద్యం మత్తులో కొట్టుకున్న ఇద్దరు పోలీసులు.. వీడియో వైరల్

Police Fighting

Police Fighting

Police fighting: సాధారణంగా రోడ్డుపై సామాన్యులు కొట్లాటకు దిగితే పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుంటారు. కానీ అదే పోలీసులు కొట్టుకుంటే వారిని ఆపడం ఎవరి తరం కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఉత్తరప్రదేశ్‌ జలౌన్‌లో తాజాగా ఇద్దరు పోలీసులు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే సదరు పోలీసులు ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న హోంగార్డు, కానిస్టేబుల్‌కు మధ్య ఘర్షణ తలెత్తగా వారిద్దరూ రోడ్డుపైకి వచ్చి అక్కడి నుంచి పక్కనే ఉన్న పొలంలోకి వెళ్లి ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో కొట్టుకున్నారు.

Read Also: Bigg Boss 6: మొదటి రోజే బాత్ రూమ్ లో ఆ పని.. కొప్పుల గొడవ మొదలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అయ్యింది. దీంతో ఈ సంఘటనపై ఎస్పీ రవికుమార్ దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా ఇద్దరు పోలీసులు రోడ్డుపైనే కొట్లాడుకుంటుంటే.. మూడో పోలీస్ ఆపడానికి ప్రయత్నించారని జలౌన్ ఎస్పీ రవికుమార్ తెలిపారు. ఇప్పటికే కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామని.. హోంగార్డుపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. అయితే ఇద్దరు పోలీసులు కొట్టుకోవడానికి గల కచ్చితమైన కారణం తెలియరాలేదు.

Exit mobile version