Site icon NTV Telugu

Nagpur: కారులో ప్రియురాలితో రొమాన్స్.. వీడియో వైరల్ కావడంతో పోలీసుల యాక్షన్..

Nagpur

Nagpur

Nagpur: నాగ్‌పూర్‌లో కారులో ఓ వ్యక్తి తన లవర్‌తో చేసిన రొమాన్స్ వైరల్ అవుతోంది. కారులో ప్రయాణిస్తూ ఇలాంటి పనులు చేయడమేంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారుని నడుపుతున్న వ్యక్తి తన ఒడిలో ప్రియురాలిని కూర్చోపెట్టుకుని మద్దు పెట్టుకుంటున్న వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటన సోమవారం జరిగింది. భారతీయ న్యాయ సంహిత (BNS), బొంబాయి పోలీస్ చట్టం మరియు మోటారు వాహనాల చట్టం. ర్యాష్ డ్రైవింగ్ చట్టాల కింద అతడిపై అభియోగాలు మోపారు.

Read Also: Elon Musk: కాలిఫోర్నియాను విడిచిపెట్టనున్న మస్క్..కారణం ఇదే..

28 ఏళ్ల వ్యక్తిని చార్డర్డ్ అకైంటెంట్‌గా సూరజ్ రాజ్‌కుమార్ సోనీగా గుర్తించారు. అతడి ప్రియురాలు ఇంజనీర్ విద్యార్థినిగా గుర్తించారు. ఇద్దరూ కారులో ప్రయాణిస్తూ రోమాన్స్ చేస్తుండటాన్ని పలువురు వీడియో తీశారు. కారు నగరంలో అత్యంత రద్దీగా ఉండే లా కాలేజ్ స్వ్కేర్ నుంచి శంకర్ నగర్ వెళ్లే మార్గంలో ఉంది. అదృష్టవశాత్తు ఇలా కారు నడుపుతున్న సందర్భంలో ఇతర వాహనదారులకు ఎలాంటి ప్రమాదం ఎదురుకాలేదు. ఈ ఘటనపై నగరంలోని అంబజారీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది. ఈ ఘటన తర్వాత నుంచి ఇద్దరూ కూడా పరారీలో ఉండగా, పోలీసులు వీరిని వార్ధా రోడ్‌లో పట్టుకున్నారు.

Exit mobile version