దేశంలో ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. రోడ్లు నదులుగా మారుతున్నాయి.. కొన్ని ఊర్లు నీళ్లల్లో కొట్టుకొని పోయాయి.. ఈ వర్షాలు చాలా మంది జీవితం వర్షాలకు అతలాకుతలం అయ్యింది.. వర్షాలకు తడవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని జనాలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు, అధికారులు పదే పదే చెబుతున్నా కూడా ఓ లవర్స్ జంట మాత్రం జోరు వానను లెక్క చెయ్యకుండా నడి రోడ్డు పై రొమాన్స్ చేస్తూ డ్యాన్స్ ఇరగదీశారు.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..ఈ వీడియోని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దీనిపై కామెంట్ల వెల్లువ వెల్లువెత్తింది..
ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏ క్షణంలో వర్షం పడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. దైనందిన జీవితంలో దినవారి పనులు చేసుకునేవారికి, వ్యాపారస్తులకు, ఉద్యోగులకి, విద్యార్ధులకి ఇలా కొన్ని వర్గాల వారికి వర్షాలు పెద్ద అడ్డంకనే చెప్పాలి. ఇలాంటి వీడియోలు చూసినప్పుడే అనిపిస్తుంది ప్రేమికులకు మాత్రమే వర్షాకాలం అనుకూలమని ఎందరో రచయితలు కూడా చెబుతున్నారు.. చల్లని చలికి వెచ్చగా…. ఉండటమే కాదు ఒక అనుభూతిని కలిగిస్తుంది.. ఇప్పుడు మనం చెప్పుకొనే లవర్స్ కూడా అలానే ఎంజాయ్ చేశారు..
ఈ ఘటన భోపాల్‌లో లో వెలుగు చూసింది.. హోరున వర్షం పడుతుండగా ప్రధాన రహదారి మీద ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు రోడ్డు మీద దూసుకుపోతుంటే ఓ ప్రేమ జంట మాత్రం పరిసరాలను అసలేమాత్రం పట్టించుకోకుండా తన్మయత్వంతో ఒకరి చేయి ఒకరు పట్టుకుని హాయిగా డాన్స్ చేస్తూ కనిపించారు. పరిసరాలు కూడా వీరి రొమాన్స్ ని పట్టించుకోకపోవడం విశేషం. వీరు డాన్స్ చేస్తుంటే వెనుక విక్కీ కౌశల్, సారా ఆలీ ఖాన్ కలిసి నటించిన జరా హట్కే జరా బచ్కే చిత్రంలోని తూ హై తో ముఝే పాట వినిపిస్తోంది. ఈ సన్నివేశాన్నివీడియో తీసి సొషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇంటర్నెట్లో దీనిపై కామెంట్ల రూపంలో విశేష స్పందన లభిస్తోంది.. ఇక మీరు ఒక లుక్ వేసుకోండి..
A beautiful couple enjoying this #mansoon in #Bhopal.#IamPureVegetarian #Karba #BusAccident #Beast #ModiAgainin2024 pic.twitter.com/GveBVp815C
— Aisha Bhat (@aishabhat02) July 29, 2023