Site icon NTV Telugu

Couple’s Romance in Beach: బీచ్ లోనే రోమాన్స్ చేసిన జంట.. వైరల్ అవుతున్న వీడియో

ఈ మధ్యకాలంలో లవర్స్ ఎక్కడ పడితే అక్కడ చెలరేగిపోతున్నారు. ఎవరు చూసుకుంటున్నారో లేదో అనే ఆలోచన లేకుండా, విచ్చలవిడిగా ఆనందం పంచుకుంటున్నారు. కొంతమంది బైక్‌లపై రొమాన్స్ చేసుకుంటే, మరికొందరు ట్రైన్ టాయిలెట్స్‌లో, ఇంకొందరు లిఫ్టుల్లో కూడా ముద్దులు పెట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో, మెట్రోలో అందరూ చూస్తుండగానే లిప్ లాక్ చేసిన జంటలు కూడా వెలుగు చూసాయి.

అయితే ఓ జంట గోవా బీచ్‌లో స్విమ్మింగ్ చేస్తూ అందరూ చూస్తుండగానే రోమాన్స్ చేస్తున్నారు. దీనిని చూసిన టూరిస్టులు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. కొత్తగా పెళ్లయిన ఈ జంట గోవాకు సంబంధించిన టీ-షర్టులు ధరించి, బీచ్‌లో సంతోషంగా ఎంజాయ్ చేస్తూ, స్విమ్మింగ్ చేస్తూ ఒకరినొకరు రోమాన్స్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

దీని గురించి నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొంతమంది వీరు చేసిన పని ప్రవర్తనకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. “బీచ్‌లో కాకుండా, రూమ్‌లో ఈ రొమాన్స్ చేయండి” అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో, గోవా బీచ్‌లో అనుచిత ప్రవర్తన పై దృష్టి పెట్టాలని, ఇటువంటి చర్యలు మరింత నియంత్రించాలని సూచనలు వస్తున్నాయి.

Exit mobile version