Site icon NTV Telugu

Bengaluru: ‘‘ అల్లా హు అక్బర్’’ అనాలంటూ దాడి.. బెంగళూర్‌లో ఘటన..

Bengaluru

Bengaluru

Bengaluru: కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను ‘‘అల్లా హు అక్బర్’’ అనాలంటూ ఇద్దరు బలవంతం చేయడంతో పాటు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బెంగళూర్ నగరంలో చోటు చేసుకుంది. శ్రీరామ నవమి వేడుకల్ని పురస్కరించుకుని బుధవారం కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మతపరమైన జెండా పట్టుకుని, జైశ్రీరాం నినాదాలు చేశారు. అయితే, ఇలా చేసినందుకు ఇద్దరు వ్యక్తులు కారును అడ్డగించి దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. విద్యారణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా.. మరొకరు పారిపోయారు.

Read Also: Arvind Kejriwal: జైలులో కేజ్రీవాల్ మామిడి పండ్లు, ఆలూ పూరీ తింటున్నాడు.. కోర్టులో ఈడీ వాదనలు..

ఇద్దరు నిందితులను ఫర్మాన్, సమీర్‌గా గుర్తించారు. వీరిద్దరు ఎంఎస్ పాళ్య నివాసితులు. నివేదిక ప్రకారం.. రామ నవమిని పురస్కరించుకుని కారులో ముగ్గురు వ్యక్తులు జెండాను ప్రదర్శిస్తూ, జైశ్రీరాం నినాదాలు చేశారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి నినాదాలను వ్యతిరేకించారు. చిక్కబెట్టహళ్లి ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది.

నిందితులు ‘అల్లాహు అక్బుర్’’ నినాదాలు చేయాలని డిమాండ్ చేశారు. జెండాను లాక్కోవడానికి ప్రయత్నించారు. ఈ వాగ్వాదం భౌతిక ఘర్షణకు దారి తీసింది. ఫర్మాన్ కర్ర తీసుకుని ముగ్గురిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఒకరికి కర్ర తగిలి తలకు గాయం కాగా.. మరొకరి ముక్కుకు గాయమైంది. బెంగళూర్ సిటీ డీసీపీ నార్త్ జోన్ బీఎమ్ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ.. నినాదాల చేయడంపై ప్రశ్నించడంతో ఈ గొడవ జరిగిందని వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా మతపరమైన నేరం, ప్రమాదకరమైన ఆయుధంతో గాయపరచడం, నేరపూరిత బెదిరింపులు మరియు అల్లర్లతో సహా భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద నిందితులు అభియోగాలను నమోదు చేశారు.

Exit mobile version