భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఇటీవలే కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని కలిశారు. ఆ సమయంలోనే వారు హస్తం పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వినిపించాయి. మొత్తానికి శుక్రవారానికి ఒక క్లారిటీ వచ్చింది. ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో వారిద్దరూ చెయ్యి పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం పార్టీలో చేరనున్నారు.
ఇది కూడా చదవండి: Fire Accident: స్కూల్ అగ్నిప్రమాదంలో 17 మంది విద్యార్థులు మృతి.. 13 మందికి గాయలు..
అక్టోబర్ 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, పునియా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగనున్నారు. ఇందుకోసమే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదని సమాచారం. వీరిద్దరూ కాంగ్రెస్‌లో చేరగానే తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఆప్‌తో పొత్తు అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఆమ్ ఆద్మీకి కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం చేస్తోంది. కానీ ఆప్ మాత్రం 10 స్థానాలు కోరుకుంటోంది. సీట్ల పంచాయితీ తెగకపోవడంతో రెండు పార్టీల మధ్య అయోమయం, గందరగోళం నెలకొంది.
ఇది కూడా చదవండి: Raj Tarun : లావణ్య కేసులో రాజ్ తరుణ్ మెడకు బిగుస్తున్న ఉచ్చు..?
అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసింది. 67 మంది సభ్యులతో కూడిన జాబితాను కమలం పార్టీ ప్రకటించింది. ఇక కాంగ్రెస్ జాబితా ప్రకటించడమే ఆలస్యం అయింది. జాబితా రాగానే బలబలాలు ఏంటో తేలిపోనుంది.
ఇది కూడా చదవండి: Pragya Nayan Sinha : అందాలతో కుర్రకారును టెంప్టింగ్ చేస్తున్న ప్రగ్యా