TVK Government Formation: తమిళనాడు కోటపై టీవీకే జెండా.. లెఫ్ట్ పార్టీలు, వీసీకే అండతో సీఎం పీఠంపై విజయ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVK Government Formation: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న రాజకీయ గందరగోళం మధ్య, దళపతి విజయ్ సర్కార్ ఏర్పాటు చేయడానికి లైన్ క్లియర్ అయ్యింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ), సిపిఎం, వీసీకే విజయ్ టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించాయి. 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ టీవీకే పార్టీ ఇప్పుడు మెజారిటీని సాధించింది. దీంతో తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువు తీరడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది.
తమిళనాడు అసెంబ్లీలో నెలకొన్న హంగ్ వాతావరణానికి తెరపడింది. అధికార పీఠానికి అవసరమైన 118 సీట్ల మేజిక్ ఫిగర్‌ను అందుకునేందుకు నానా తంటాలు పడుతున్న తమిళిగ వెట్టి కజగం (TVK) అధినేత విజయ్‌కు కాంగ్రెస్ సహా వామపక్షాలు, వీసీకే మద్దతు తెలపడంతో అధికార పీఠం టీవీకేకు లాంఛనం కానుంది.
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
టీవీకే- 107 (విజయ్ రెండు చోట్ల గెలిచిన సందర్భంగా ఒక స్థానం పరిగణలోకి తీసుకోరు)
భారత జాతీయ కాంగ్రెస్ – 5
భారత కమ్యూనిస్ట్ పార్టీ – 2
కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) – 2
విడుతలై చిరితగ్గుల్ కట్చి (వీసీకే)- 2
మొత్తం – 118
విజయ్ నివాసంలో కీలక భేటీలు..
పట్టినాపాక్కంలోని విజయ్ నివాసం ఇప్పుడు రాజకీయ కార్యకలాపాలకు అడ్డాగా మారింది. వీసీకే నేత ఆదవ్ అర్జున్ స్వయంగా విజయ్‌ను కలిసి మద్దతు ప్రకటించగా, సీపీఐ కార్యవర్గ సమావేశం కూడా టీవీకేకు జై కొట్టింది. అటు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సైతం విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నాలుగు పార్టీల నేతలు ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి, ఆపై గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమ వాదనను బలంగా వినిపించనున్నారు. ఇప్పటివరకు టీవీకే రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ మెజారిటీ లేదన్న కారణంతో గవర్నర్ నుంచి ఆటంకాలు ఎదుర్కొన్న పార్టీ అధినేత విజయ్‌కు, ఇప్పుడు 118 మంది ఎమ్మెల్యేల బలం తోడవ్వడం రాజకీయంగా పెద్ద విజయంగా భావిస్తున్నారు. ఈ పరిణామంతో తమిళనాడులో దశాబ్దాల ద్రావిడ రాజకీయాల్లో ఒక కొత్త శకం, ‘విజయ్ శకం’ మొదలవబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!