టీవీకే అధినేత విజయ్ త్వరలోనే ఓదార్పు యాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కరూర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాలను కలిసేందుకు పరామర్శ బాటపట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు బాధిత కుటుంబాలకు విజయ్ ఫోన్ చేసి విషయం తెలియజేశారు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇది కూడా చదవండి: UP: ఓ అన్న మరణశాసనం.. నుదిటపై సిందూరం చూసి ఇంటర్ విద్యార్థి పరువు హత్య
ఇటీవల విజయ్ కరూర్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాట కారణంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్ది గాయాలు పాలయ్యారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగింది. మీరు కారణమంటే.. మీరే కారణమంటూ అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక టీవీకేకు సంబంధించిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని తొలుత వ్యతిరేకించిన న్యాయస్థానం.. ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. మరోవైపు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు అనుమతివ్వరని తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో సంచలన విషయాలు.. ఖాతాలో రూ.కోటి జమ
