TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
- తమిళనాడులో విజయ్ కూటమికి కొత్త పేరు
- ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVK-Congress Alliance: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు, తమిళ వెట్రి కజగం (TVK) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని రాజకీయ కూటమికి అధికారికంగా ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’ (Secular Social Justice Victory Alliance) అనే పేరు ఖరారైంది. విజయ్ నేతృత్వంలోని TVKతో పాటు కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), విదుతలై చిరుతైగల్ కట్చి (VCK), మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK) పార్టీలు ఈ కూటమిలో భాగంగా ఉన్నాయి.
TVK కార్యాలయంలో కీలక సమావేశం
కూటమి పేరును ఖరారు చేసేందుకు బుధవారం చెన్నైలోని పనైయూర్లో ఉన్న TVK ప్రధాన కార్యాలయంలో భాగస్వామ్య పార్టీల నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్, VCK, MDMK, IUML పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం కూటమికి ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’ అనే పేరును అధికారికంగా ఖరారు చేశారు.
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
కాంగ్రెస్ నుంచి ఎవరెవరు హాజరయ్యారు?
సమావేశానికి కాంగ్రెస్ తరఫున మాణిక్కం ఠాగూర్, తారగై కాథ్బర్ట్, ప్రవీణ్ చక్రవర్తి హాజరయ్యారు.
VCK తరఫున పార్టీ అధినేత తోల్ తిరుమావళవన్ తో పాటు వన్ని అరసు, రవి కుమార్, సిందనై సెల్వన్ పాల్గొన్నారు.
MDMK తరఫున పార్టీ నేత వైకోతో పాటు దురై వైకో సమావేశానికి హాజరయ్యారు.
IUML నుంచి కే.ఎం. కాదర్ మొహిదీన్, షాజహాన్ పాల్గొన్నారు.
సెక్యులరిజం, సామాజిక న్యాయంపై దృష్టి
కూటమిలోని ప్రధాన పార్టీలకు సెక్యులరిజం, సామాజిక న్యాయం వంటి అంశాలపై బలమైన రాజకీయ వైఖరి ఉంది. అదే అంశాలను ప్రతిబింబించేలా కూటమికి ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’ అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ఈ కూటమి రాబోయే ఎన్నికల పోరులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. TVK ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్, VCK, MDMK, IUML వంటి పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేయడం రాజకీయ సమీకరణాలను మరింత ఆసక్తికరంగా మార్చింది.
ఎన్నికల ముందు మరో అడుగు
కూటమి పేరును అధికారికంగా ఖరారు చేయడం ద్వారా భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయడానికి మరో అడుగు పడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ మరింత తీవ్రం కానున్న నేపథ్యంలో, విజయ్ నేతృత్వంలోని ఈ కూటమి ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’ పేరుతో ఎన్నికల బరిలోకి దిగనున్న ఈ కూటమి.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయంగా నిలుస్తుందా? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?