Vigilance Raids: బిహార్‌లోని పాట్నాలో కిషన్ గంజ్ ఆర్‌డబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంజయ్ కుమార్ రాయ్ ఇంటిపై విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారులు శనివారం ఉదయం ఈ దాడులను ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు రూ.5కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కిషన్‌గంజ్, పాట్నాలోని ఇతర ప్రాంతాల్లో దాడులు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అధికారులు దాడులు చేయడానికి వెళ్లినప్పుడు నిందితుడు అవినీతి సొమ్మును అతనికి సంబంధించిన వాళ్ల ఇంట్లో దాచే ప్రయత్నం చేయగా.. అధికారులు వారి ఇళ్లలో కూడా సోదాలు చేశారు.
Ghulam Nabi Azad: రెండు వారాల్లో గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ..
కిషన్‌గంజ్‌లో రూ.4కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకోగా.. పాట్నాలో రూ. కోటి రూపాయలు దొరికినట్లు తెలుస్తోంది. ఈ కేసులు దాడులను ఇంకా కొనసాగిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సంజయ్ కుమార్ రాయ్ భూములకు సంబంధించిన దస్తావేజులను, బ్యాంకు లాకర్లను అధికారులు పరిశీలించనున్నారు. ఈ దాడులు చాలా దస్తావేజులు దొరికాయని, వాటిని పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
