Site icon NTV Telugu

Kejriwal: ఈవీఎంలతో జిమ్మిక్కులకు బీజేపీ కుట్ర.. అప్రమత్తంగా ఉండాలన్న కేజ్రీవాల్

Kejriwal

Kejriwal

బీజేపీపై ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎం యంత్రాల ద్వారా 10 శాతం ఓట్లలో వ్యత్యాసాలు కలిగిస్తారని నివేదికల ద్వారా సమాచారం అందిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కొద్ది నిమిషాల్లో ముగియనుంది. ఈ సందర్భంగా ఢిల్లీ ఓటర్లను ఉద్దేశించి కేజ్రీవాల్ సందేశం విడుదల చేశారు.

ఇది కూడా చదవండి: Zinc Rich Foods: జింక్ లోపం ఉన్న వాళ్లు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో తెలుసా..?

ప్రతి ఓటు ఆప్‌కి వెళ్లేలా పెద్ద సంఖ్యలో ఓట్లు వేయాలని కోరారు. ప్రతి చోట 10 శాతం ఆధిక్యం వచ్చేలా ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలను ఎదుర్కోవడానికి ఏకైక మార్గం పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడమేనన్నారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ద్వారా ఒక గుణపాఠం నేర్చుకున్నామన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. యంత్రాలు ట్యాంపర్ చేయలేని విధంగా ప్రతి పోలింగ్ బూత్ వివరాలను అప్‌లోడ్ చేస్తామన్నారు. లెక్కింపు రోజున వ్యత్యాసాలు గమనించుకోవచ్చని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: CPM: సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావు తిరిగి ఎన్నిక..

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదలకానున్నాయి. ఈ సారి ఆప్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అలాగే కాంగ్రెస్ కూడా పోటీ ఇస్తోంది. అయితే మరోసారి అధికారం కోసం ఆప్.. ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

 

Exit mobile version