Site icon NTV Telugu

Stage Collapse: ప్రధాని మోడీ రోడ్ షోలో ప్రమాదం..

Madhyapradesh

Madhyapradesh

Stage Collapse: ప్రధాని నరేంద్రమోడీ మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. జబల్‌పూర్‌లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోజు జరిగిన రోడ్ షోకు భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు హాజరయ్యారు. ఇదిలా ఉంటే, రోడ్ షోలో స్వల్ప ప్రమాదం జరిగింది. వేదిక కూలిపోవడంతో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Read Also: Tejashwi Yadav: నితీష్ కుమార్ ప్రధాని మోడీ పాదాలను తాకడం సిగ్గుచేటు..

అంతకుముందు ప్రధాని మోడీని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చారు. రోడ్ షోలో ప్రధాని మోదీతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, జబల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఆశిష్ దూబే, రాష్ట్ర కేబినెట్ మంత్రి రాకేష్ సింగ్ కూడా ఉన్నారు. రోడ్ షో సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో గుమిగూడిన వీడియోను ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. జబల్‌పూర్ రోడ్ షో ‘అద్భుతం’ అని అభివర్ణించారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలోని క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న రాకేష్ సింగ్ 2004, 2019 మధ్య జబల్ పూర్ నుంచి వరసగా లోక్‌సభకు నాలుగుసార్లు గెలిచారు. అయితే, ఈ సారి బీజేపీ కొత్త వ్యక్తి ఆశిష్ దూబేని రంగంలోకి దించింది. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి దినేష్ యాదవ్‌తో పోటీ పడుతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని 29 సీట్లకు గానూ 28 స్థానాలను గెలుచుకుంది.

Exit mobile version