Site icon NTV Telugu

Flight delay: విమానం పక్కన కూర్చుని ప్రయాణికుల భోజనం.. వీడియో వైరల్..

Indigo

Indigo

Flight delay: పొగమంచు కారణంగా ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో విమానాల కార్యకలాపాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. గంటల కొద్దీ ప్రయాణికులు విమానాల్లోనే చిక్కుకుపోయారు. ప్రయాణికుల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఇండిగో విమానంలో ఫ్లైట్ డిలే అవుతుందని ప్రకటించిన కెప్టెన్‌పై ప్రయాణికుడు అసహనంతో దాడి చేశాడు. ఈ ఘటనపై కేంద్రం విమానయాన శాఖ మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దాదాపుగా 100 విమానాలు ఆలస్యమయ్యాయి. చాలా మంది ప్రయాణికులు తమ విమానం ఎప్పుడు ఎగురుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు.

Read Also: Thangalaan: తంగలాన్ వాయిదా.. దేవరకు పోటీగా అయితే రామాకు విక్రమ్ బ్రో..

ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రయాణికులు విమానం పక్కన నేలపై కూర్చుని భోజనం చేస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇండిగో గోవా-ఢిల్లీ ప్రయాణీకులు 12 గంటల ఆలస్యం తర్వాత ఇండిగో విమానాన్ని ముంబైకి మళ్లించారు, ప్యాసింజర్లు విమానం పక్కనే డిన్నర్ చేస్తున్నారు’’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. పొగమంచు కారణంగా విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానయాన సంస్థలు ప్రయాణికులతో కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి, విమాన రద్దు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తెలియజేయడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP) జారీ చేస్తుందని మంత్రి తెలిపారు.

Exit mobile version