Site icon NTV Telugu

Viral Video: కోతి ధాటికి కారు “సన్‌రూఫ్” ఖతం.. వీడియో వైరల్..

Monkey Breaks Sunroof

Monkey Breaks Sunroof

Viral Video: ఇటీవల కాలంలో కారు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ముఖ్యంగా దాంట్లో ‘‘సన్‌రూఫ్’’ ఫీచర్ ఉందా..? లేదా..?అనేది చూస్తున్నారు. సన్‌రూఫ్ ఉన్నవాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో అన్ని కంపెనీలు కూడా తమ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోని ప్రతీ కారుకి కూడా సన్‌రూఫ్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి.

అయితే, తాజాగా ఉత్తర్ ప్రదేశ్ వారణాసికి చెందిన ఈ వైరల్ న్యూస్ చూస్తే మాత్రం, కారు కొనుగోలు చేసేవారు, సన్‌రూఫ్ గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. పార్కింగ్ చేసిన కారు సన్‌రూఫ్‌పై ఒక కోతి ఒక్కసారిగా దూకింది. దీంతో సన్‌రూఫ్ పగిలిపోయి కోతి కారులో పడిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వారణాసిలోని విషేశ్వర్ గంజ్ ప్రాంతంలో ఇది జరిగింది.

Read Also: Keerthy Suresh: దుబాయ్‌లో కోటీశ్వరుడు.. కీర్తిని పెళ్లి చేసుకోబోయే ఆంథోనీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు కోతి పరిస్థితి ఎలా ఉందో అని, మరికొందరు కార్ ఓనర్ పరిస్థితి ఏంటని చర్చిస్తున్నారు. నిజానికి సన్‌రూఫ్ ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తుందా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పరిస్థితిని కార్ ఓనర్ ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద ఎలా వివరిస్తారని నెటిజెన్లు పోస్టులు పెడుతున్నారు. మరొక నెటిజన్ ‘‘అందుకే నేను మా నాన్నను కారు కొనమని ఎప్పుడూ అడగలేదు. కారు లేదు, నష్టం లేదు’’ అని వ్యాఖ్యానించారు.

Exit mobile version