NTV Telugu Site icon

Viral Video: కారులో భార్య, ఆమె ప్రియుడు.. కారు బానెట్‌పై భర్త.. వైరల్ వీడియో..

Moradabad

Moradabad

Viral Video: తన భార్య, ఆమె ప్రియుడిని ఒక వ్యక్తి కారులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. కారును ఆపే ప్రయత్నం చేశారు. అయితే, ఆ వ్యక్తిని కారుతో ఢీకొట్టారు. దీంతో అతను కారు బానెట్‌పై పడిపోయాడు. అయినా కూడా ఆపకుండా ఒక కిలోమీటర్ వరకు ఇలాగే ఈడ్బుకుంటూ వెళ్లారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మొరాదాబాద్-ఆగ్రా హైవేపై బుధవారం సాయంత్రం జరిగింది.

సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 31 ఏళ్ల మొహద్ సమీర్, తన భార్య నూర్ అప్షా(29)ని, ఆమె ప్రియుడు నజ్రుల్ హసన్(32)లు కారులో ఉన్నారని గుర్తించి, వారిని వెంబడించాడు. తన బైక్ అడ్డుపెట్టి ఆపే ప్రయత్నం చేశారు. వీరిద్దరు కూడా సమీర్‌ని కారుతో ఢీకొట్టి, కారుని వేగంగా నడిపారు. సమీర్ కారు బానెట్‌పై పడినా, ఆపకుండా అలాగే ఒక కిలోమీటర్ ఈడ్చుకెళ్లారు. గంటకు 80-90 కి.మీ వేగంతో కారు ప్రయాణించినప్పటికీ, బానెట్‌ని గట్టిగా పట్టుకుని సమీర్ ప్రాణం దక్కించుకున్నాడు. మరో వాహనం కారుకు అడ్డుగా నిలవడంతో కారుని నిలిపేశారు.

Read Also: PAK Youtubers: అదృశ్యమైన “పాక్ యూట్యూబర్లు”.. భారత్‌ని ప్రశంసించడం పాక్ ఆర్మీకి నచ్చలేదా..?

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమీర్ ఈ ఘటనపై మొరాదాబాద్‌లోని కట్‌ఘర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమీర్ భార్య టీచర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే టాక్సీ డ్రైవర్ హసన్‌తో సంబంధం పెట్టుకుంది. బుధవారం రాత్రి హసన్‌తో తన భార్యని చూశాడు.ఈ నేపథ్యంలోనే ఇద్దరు వేగంగా పారిపోయేందుకు ప్రయత్నించారని, తనను ఢీకొట్టారని సమీర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అఫ్షా, సమీర్‌లకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం అయింది. అయితే, అప్పటికే ఆమె హసన్‌తో సంబంధాన్ని కలిగి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.