Site icon NTV Telugu

MLA Slaps Police: విధుల్లో ఉన్న పోలీస్‌పై చేయి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే..

Mla Slaps Police

Mla Slaps Police

MLA Slaps Police: విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారిపై ఎమ్మెల్యే చేయి చేసుకోవడం వివాదాస్పదం అయింది. మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. పూణేలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై బీజేపీ ఎమ్యెల్యే చేయి చేసుకున్నారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఈ రోజు తెలిపారు. పూణే కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు సునీల్ కాంబ్లే పూణేలోని సాసూన్ జనరల్ హాస్పిటల్‌లో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ను కొట్టిన సంఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Read Also: Alaska Airlines Boeing 737 MAX: 16 వేల అడుగుల ఎత్తులో ఊడిపోయిన విమానం డోర్..

కానిస్టేబుల్ ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యే కాంబ్లేపై ఐపీసీ సెక్షన్ 353(ప్రభుత్వ సేవకుడిని తన విధులను నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా క్రిమినల్ ఫోర్స్) కింద కేసు నమోదు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. పూణేలోని సాసూన్ జనరల్ హాస్పిటల్‌లో జరిగిన కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.

ఎమ్మెల్యే కాంబ్లే ఈవెంట్ తర్వాత మెట్లు దిగుతూ, తన దారికి అడ్డుగా వచ్చిన వ్యక్తిని చంపదెబ్బ కొట్టడం కనిపిస్తుంది. పోలీస్ కానిస్టేబుల్ బండ్‌గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఆరోపణల్ని ఎమ్మెల్యే కాంబ్లే ఖండించారు. తాను ఎవరిపై దాడి చేయలేదని, నేను మెట్లు దిగుతుండగా ఎవరో అడ్డంగా వచ్చినప్పుడు పక్కకు తోసి ముందుకెళ్లానని అన్నారు.

Exit mobile version