Site icon NTV Telugu

Sadhvi Prachi: స్వరా భాస్కర్ పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారి “ఫ్రిజ్” చూడాల్సింది..

Swara Bhaskar ,arriage

Swara Bhaskar ,arriage

Sadhvi Prachi On Swara Bhasker Marriage: బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ ఇటీవల సమాజ్ వాదీ పార్టీ నేత ముస్లిం అయిన ఫహద్ అహ్మద్ ను పెళ్లి చేసుకుంది. దీనిపై ఇటు హిందూ, అటు ముస్లిం వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంత మంది ముస్లిం మతపెద్దలు ఈ వివాహాన్ని తప్పుబట్టారు. ఇదిలా ఉంటే హిందూ నేతలు కూడా స్వరా తీరును విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వివాహం గురించి విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) నాయకురాలు సాధ్వీ ప్రాచీ కాలక వ్యాఖ్యలు చేశారు.

Read Also: Teachers Affair: టీచర్ల వివాహేతర సంబంధం.. ఫోన్ కాల్‌తో అడ్డంగా బుక్

స్వరాభాస్కర్ హిందూ మతానికి వ్యతిరేకి అని.. ఆమె తన మతానికి చెందిన వారిని కాదని పెళ్లి చేసుకుంటుందని అనుకున్నానని.. ఇప్పుడు అది జరిగిందని, ఓ ముస్లింను వివాహం చేసుకుందని సాధ్వీ ప్రాచీ అన్నారు. శ్రద్ధా వాకర్ ను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా చంపి, 35 ముక్కలుగా చేసి ఫ్రిజ్ లో పెట్టాడని.. స్వరా భాస్కర్ కు కూడా ఇదే గతి పట్టవచ్చని అన్నారు. శ్రద్ధా వాకర్ విషయాన్ని స్వరాభాస్కర్ పట్టించుకోలేదని.. పెళ్లి వంటి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఫ్రిజ్ చూసి ఉండాల్సిందంటూ వ్యాఖ్యానించారు. పెళ్లి ఆమె వ్యక్తిగతం, నేను పెద్దగా చెప్పడానికి ఏం లేదు, కానీ శ్రద్ధకు జరిగిందే స్వరాకు జరగవచ్చని సాధ్వీ ప్రాచీ అన్నారు.

ఇదిలా ఉంటే స్వరా భాస్కర్, ఫహాద్ ను పెళ్లి చేసుకోవడం లీగర్ కావచ్చు, కానీ ఇస్లామిక్ కాదని చికాగోకు చెందిన ఓ ఇస్లామిక్ పండితుడు వ్యాఖ్యానించాడు. విగ్రహారాధన చేసే స్త్రీలను పెళ్లి చేసుకోకూడదని ఖురాన్ చెబుతోందని.. ఒక వేళ పెళ్లి కోసమే స్వరా భాస్కర్ ఇస్లాంలోకి చేరితే దాన్ని అల్లా అంగీకరించడని వ్యాఖ్యానించాడు. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ మాట్లాడుతూ స్వరా భాస్కర్ ఇస్లాంను అంగీకరించకుండా ఫహద్‌ను వివాహం చేసుకోలేరని అన్నారు.

Exit mobile version