NTV Telugu Site icon

Ayodhya Ram Temple: అద్వానీ, జోషిలకు ఆహ్వానం ఇచ్చిన విశ్వ హిందూ పరిషత్

Ayodhya Ram Madir Invitaion

Ayodhya Ram Madir Invitaion

అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆహ్వానించింది. రామమందిర నిర్మాణం కోసం ఎంతో కృషి చేసిన అద్వానీ, జోషిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని మొదట ఆలయ ట్రస్ట్ తెలిపిన విషయం తెలిసిందే. వారి వయసు, ఆరోగ్యం దృష్ట్యా ఈ వేడుకకు రావోద్దని వారిని అభ్యర్థించినట్టు రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. వారి వయస్సును పరిగణనలోకి తీసుకుని రావద్దని మొదట అభ్యర్థించామని, ఇందుకు వారితో పాటు కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారని చంపత్ రాయ్ అన్నారు.

Also Read: UK: పీరియడ్స్ నొప్పి.. భరించలేక గర్భనిరోధక మాత్రలు.. 16 ఏళ్ల బాలిక బ్రెయిన్ డెడ్

అయితే రామ మందిర ఆలయ ప్రారంభోత్సవానికి రావాలంటూ తాజాగా అద్వానీ, జోషిలను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రిక ఇచ్చినట్టు విశ్వహిందూ పరిషత్ సభ్యుడు అలోక్ కుమార్ తెలిపారు. కాగా జనవరి 22వ తేదీన జరిగే రామ మందిర ఆలయ ప్రారంభోత్సవంకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయనకు ఆహ్వానం కూడా అందజేశారు. జనవరి 15వ తేదీలోపు ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తామని, ఆ మరుసటిరోజు ప్రాణ ప్రతిష్ట పూజ మొదలై.. జనవరి 22వ తేదీదాకా కొనసాగుతుందని చంపత్‌ రాయ్‌ పేర్కొన్నారు. అయోధ్య రామ మందరి ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా హిందూ సంఘాల ప్రతినిధులు, ఆలయ పూజారులు, మఠాధిపతులు, రాజకీయ-సినీ ఇతర రంగాల ప్రముఖులకు సైతం ఆహ్వానాలు వెళ్తున్నట్టు ఆయన తెలిపారు.

Also Read: INDIA bloc: ప్రధాని అభ్యర్థిగా ఖర్గేను తిరస్కరించిన ఇండియా కూటమి