Site icon NTV Telugu

వాహ‌నాల‌కు రిఫ్లెక్టివ్‌ టేప్ త‌ప్ప‌నిస‌రి.. లేదా రూ.10వేలు ఫైన్..!

రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు క‌ఠిన చ‌ర్య‌ల‌కు పూనుకుంటున్నారు అధికారులు.. ముఖ్యంగా ఓ వైపు ద‌ట్ట‌మైన పొగ మంచు… దీంతో.. రాత్రి స‌మ‌యంలో, తెల్ల‌వారు జామున రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతూనే ఉన్నాయి.. అయితే, వాటిని నివారించేందుకు నొయిడా అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.. వాహనాలకు రిఫ్లెక్టివ్‌ టేప్‌ లు తప్పనిసరి చేశారు. పొగమంచు ఉన్న సమయంలో త‌న ముందు వాహ‌నం ఎక్క‌డ ఉందో కూడా తెలియ‌ని ప‌రిస్థితులు ఉంటాయి.. ఎదురుగా ఉన్న వాహనాలు క‌నిపించ‌క వెన‌క‌నుంచి ఢీకొట్ట‌డంలో అనే ప్ర‌మాదాలు జ‌రుగుతూనే ఉన్నాయి.. వాటి నివారణకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నొయిడా పోలీసులు వెల్ల‌డించారు.

Read Also: మ‌ళ్లీ పెరిగిన చ‌లి తీవ్ర‌త‌.. సాధార‌ణం కంటే త‌క్కువ‌గా న‌మోదు..

పొగ‌మంచు కురిసే స‌మ‌యంలో.. రాత్రిపూట, వెలుతురు తక్కువగా స‌మ‌యాన్ని వాహ‌నాల‌కు వెనుక‌భాగంలో ఉండే ఈ మెరిసే టేప్‌లు డ్రైవ‌ర్ల‌ను అల‌ర్ట్ చేస్తాయ‌ని.. ఇది ప్ర‌మాదాల నివార‌ణ‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని అధికారులు చెబుతున్నారు.. కొన్నిసార్లు వాహనం వెనుక ఉన్న లైట్లు సరిగా ప‌నిచేయ‌కుండా పోతాయి.. అలాంటి స‌మ‌యంలో.. ఈ టేప్ ఎంతో ఉప‌యోగం ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇక‌, ఈ నిబంధ‌న‌ను ఉల్లంఘిస్తే.. భారీ ఫైన్ విధించేందుకు సిద్ధం అవుతున్నారు అధికారులు.. మోటారు వాహనాల చట్టం ప్రకారం.. రిఫ్లెక్టివ్‌ టేప్ వేయించ‌నివారికి రూ. 10,000 ఫైన్‌ వేస్తామని ప్ర‌క‌టించారు..

Exit mobile version