Jagdeep Dhankhar: ‘‘బైపాస్ సర్జరీకి కూరగాయల కత్తిని వాడకూడదు’’.. ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
- ‘‘బైపాస్ సర్జరీకి కూరగాయల కత్తిని వాడకూడదు’’..
- తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై జగదీప్ ధన్ఖర్ వ్యాఖ్యలు..
- కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపణ..
- అవిశ్వాసం వ్యక్తిగతంగా బాధించిందన్న ధన్ఖర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagdeep Dhankhar: కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పార్టీలు తనపై పెట్టిన ‘‘అవిశ్వాస తీర్మానం’’ రాజ్యసభ చైర్పర్సన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘బైపాస్ సర్జరీ కోసం కూరగాయలను కోసే కత్తిని ఎప్పుడూ ఉపయోగించవద్దు’’ అంటూ సెటైర్లు వేశారు. ‘‘ఉపరాష్ట్రపతికి వ్యతిరేకంగా ఇచ్చిన నోటీసులు ఒక్కసారి చూడండి, మీరు షాక్ అవుతారు. బైపాస్ సర్జరీకి ఎప్పుడూ కూరగాయలను కోసే కత్తిని ఉపయోగించవద్దు అని మాజీ ప్రధాని చంద్రశేఖర్ జీ ఒకసారి అన్నారు. ’’ అని చెప్పారు. తనపై ఇచ్చిన నోటీసులు కూరగాయలు కోసే కత్తి కూడా కాదని, అది తప్పుపట్టిన కత్తి అని ఆయన అన్నారు.
మహిళా జర్నలిస్టుల సమావేశంలో ధన్ఖర్ మాట్లాడుతూ.. ‘‘తాను నోటీసులు చూసి ఆశ్చర్యపోయాను, కానీ నన్ను మరింత ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, మీరెవరూ చదవులేదు. ఒక వేళ మీరు దానిని చదివి ఉంటే రోజుల తరబడి నిద్రపోయే వారు కాదు’’ అని ఆయన అన్నారు.
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
Read Also: Kishan Reddy: నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి వాజ్ పేయి..
సోనియా గాంధీ-జార్జ్ సోరోస్ మధ్య సంబంధాలపై బీజేపీ ఎంపీలు మాట్లాడేందుకు అనుమతించడంపై కాంగ్రెస్ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్పై ‘‘అవిశ్వాస తీర్మానం’’ ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాలకు మాత్రం అదానీ-మోడీ విషయంపై చర్చించేందుకు అనుమతించలేదని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన తీర్మానంలో తప్పులు ఉండటంతో పాటు 14 రోజుల ముందు నోటీసులు ఇవ్వకపోవడంతో దీనిని డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తిరస్కరించారు.
తనపై వచ్చిన నోటీసులు తనను తీవ్రంగా బాధించాయని ధన్ఖర్ చెప్పారు. ఇలాంటి వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్‌ని నిందించారు. నాకు వ్యతిరేకంగా తీర్మానం పెట్టే రాజ్యాంగ హక్కు వారికి ఉందని, కానీ ఛైర్మన్‌పై రోజుకో ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!