NTV Telugu Site icon

Jagdeep Dhankhar: ‘‘బైపాస్ సర్జరీకి కూరగాయల కత్తిని వాడకూడదు’’.. ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..

Jagdeep Dhankhar

Jagdeep Dhankhar

Jagdeep Dhankhar: కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పార్టీలు తనపై పెట్టిన ‘‘అవిశ్వాస తీర్మానం’’ రాజ్యసభ చైర్‌పర్సన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘బైపాస్ సర్జరీ కోసం కూరగాయలను కోసే కత్తిని ఎప్పుడూ ఉపయోగించవద్దు’’ అంటూ సెటైర్లు వేశారు. ‘‘ఉపరాష్ట్రపతికి వ్యతిరేకంగా ఇచ్చిన నోటీసులు ఒక్కసారి చూడండి, మీరు షాక్ అవుతారు. బైపాస్ సర్జరీకి ఎప్పుడూ కూరగాయలను కోసే కత్తిని ఉపయోగించవద్దు అని మాజీ ప్రధాని చంద్రశేఖర్ జీ ఒకసారి అన్నారు. ’’ అని చెప్పారు. తనపై ఇచ్చిన నోటీసులు కూరగాయలు కోసే కత్తి కూడా కాదని, అది తప్పుపట్టిన కత్తి అని ఆయన అన్నారు.

మహిళా జర్నలిస్టుల సమావేశంలో ధన్‌ఖర్ మాట్లాడుతూ.. ‘‘తాను నోటీసులు చూసి ఆశ్చర్యపోయాను, కానీ నన్ను మరింత ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, మీరెవరూ చదవులేదు. ఒక వేళ మీరు దానిని చదివి ఉంటే రోజుల తరబడి నిద్రపోయే వారు కాదు’’ అని ఆయన అన్నారు.

Read Also: Kishan Reddy: నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి వాజ్ పేయి..

సోనియా గాంధీ-జార్జ్ సోరోస్ మధ్య సంబంధాలపై బీజేపీ ఎంపీలు మాట్లాడేందుకు అనుమతించడంపై కాంగ్రెస్ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌పై ‘‘అవిశ్వాస తీర్మానం’’ ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాలకు మాత్రం అదానీ-మోడీ విషయంపై చర్చించేందుకు అనుమతించలేదని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన తీర్మానంలో తప్పులు ఉండటంతో పాటు 14 రోజుల ముందు నోటీసులు ఇవ్వకపోవడంతో దీనిని డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తిరస్కరించారు.

తనపై వచ్చిన నోటీసులు తనను తీవ్రంగా బాధించాయని ధన్‌ఖర్ చెప్పారు. ఇలాంటి వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్‌ని నిందించారు. నాకు వ్యతిరేకంగా తీర్మానం పెట్టే రాజ్యాంగ హక్కు వారికి ఉందని, కానీ ఛైర్మన్‌పై రోజుకో ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు.

Show comments