Vasooli Titans: భారత మమిళ క్రికెటర్ పూజా వస్త్రాకర్ ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ, కించపరిచేలా పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. బీజేపీ నాయకులను హేళన చేస్తూ..‘‘ వసూలీ టైటాన్స్’’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దీనిని ఉపయోగించుకుని కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు చేస్తున్నాయి.
ఇటీవల జరిగి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) 2024లో ముంబై ఇండియన్స్ (MI)కి ప్రాతినిధ్యం వహించిన పూజా ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ పెట్టి పోస్టు వివాదాస్పదం కావడంతో దానిని డెలీట్ చేసింది. అయితే, ఆమె చేసిన పోస్టుకు మిశ్రమ స్పందన లభించింది. కొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసించగా.. మరికొందరు ఆమెను భారత జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
Read Also: Ravindra Jadeja: వదిన తర్వాత నేనే అయి ఉంటాను.. ధోనీ తనను ఎత్తుకోవడంపై జడ్డూ వ్యాఖ్యలు
అయితే, ఈ పోస్టును ఆమె తొలగించినప్పటికీ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల దోపిడీ నుంచి బయటపడేందుకు బీజేపీ తనను అరెస్ట్ చేసినట్లు కేజ్రీవాల్ కోర్టులో ప్రకటన చేసిన తర్వాత ఆమె ఈ పోస్టు పెట్టింది. కొందరు కాంగ్రెస్‌కి మద్దతుగా నిలువగా.. మరికొందరు భవిష్యత్తులో ఈమె తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఒక యూజర్ ‘‘ఇది కాంగ్రెస్ పోస్ట్’’ అని కామెంట్ చేయగా.. మరకొరు ‘‘పిచ్చిదానా, వెంటనే డిలీట్ చేయి లేకుంటే కెరీర్ ఖతం అవుతుంది’’ అంటూ కామెంట్ చేశారు. కొందర నెటిజన్లు పూజా అకౌంట్ హ్యాక్ అయిందని, ఆమె ఈ పోస్టు చేయలేదని ఊహాగానాలు వ్యక్తం చేశారు.
