Namo Bharat Rapid Rail: భారత రైల్వేలు అధునాతనంగా మారుతున్నాయి. ఇప్పటికే పట్టాలపై వందేభారత్ సెమీ హై స్పీడ్ ట్రైన్ పరుగులు తీస్తోంది. మరోవైపు వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ని ప్రారంభించేందు భారతీయ రైల్వే సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ‘‘వందే మెట్రో రైలు’’ని ప్రధాని నరేంద్రమోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.
అయితే, ఈ రైలు పేరును మారుస్తు రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వందే మెట్రో రైలుని ‘‘ నమో భారత్ ర్యాపిడ్ రైలు’’గా పేరు మార్చినట్లు రైల్వే మంత్రిత్వ శఆఖ వర్గాలు తెలిపాయి. దేశంలో తొలి నమో భారత్ ర్యాపిడ్ రైలు ఈ రోజు ప్రారంభమైంది. ఈ రైలు భుజ్ మరియు అహ్మదాబాద్ మధ్య పరుగులు తీయనునుంది. ఇంటర్ సిటీల మధ్య కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ఈ రైలుని తీసుకువచ్చారు. తొలి రైలు ఈ రెండు నగరాల మధ్య 359 కి.మీ ప్రయాణించనుంది.
Read Also: Uttar Pradesh: అపాచీ బైక్, 3 లక్షలు ఇవ్వలేదని భర్త దారుణం..
“వందే మెట్రో పేరును నమో భారత్ ర్యాపిడ్ రైల్‌గా మార్చాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది” అని విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు. ఇతర మెట్రోలు తక్కువ దూరమే ప్రయాణిస్తుండగా, నమో భారత్ రైళ్లు మాత్రం నగరాలు, పట్టణాల మధ్య ఎక్కువ దూరం ప్రయాణించేందుకు రూపొందించారు. మొత్తం 12 కోచ్‌లు కలిగిన ఈ రైలు 1150 మంది ప్రయాణికులు కూర్చునే విధంగా ఉంది.
“ఎర్గోనామిక్‌గా డిజైన్ చేయబడిన సీట్లు, పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్‌లు మరియు మాడ్యులర్ ఇంటీరియర్స్‌తో, ఇది ఖచ్చితంగా ఇతర మెట్రోల కంటే మెరుగైనదని రుజువు చేస్తుంది” అని రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. సబర్బన్ రైళ్లు, మెట్రో కోచ్‌ల నుంచి ముఖ్యమైన అప్‌గ్రేడ్స్ ఈ రైలులో కనిపిస్తున్నాయి. ఇందులో ఎజెక్టర్ ఆధారిత వాక్యూమ్ ఎవాక్యుయేషన్ టాయిలెట్లు ఉన్నాయి. రైలు మధ్య-దూర నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణాలను అందిస్తుంది.